‘భరత్ అనే నేను’ ఓ పక్క… జూనియర్ ఎన్టీఆర్ మరో పక్క..!

Jr NTR Koratala Siva Visits Bhadrachalam Templeప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింపుల్ లుక్ లో ఉన్న మహేష్ బాబు, ఆయన వెనుక ఫైల్స్ పట్టుకుని సిన్సియర్ గా నడుచుకు వస్తున్న బ్రహ్మాజీలతో కూడిన ఈ ఫోటో నెట్టింట లీకై హంగామా చేస్తోంది. సక్సెస్ కోసం ఆకలితో ఎదురుచూస్తున్న ప్రిన్స్ అభిమానులకు, ఈ ఫోటోలు కాస్త ఊరటనిస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే లుక్ పరంగా మహేష్ గత చిత్రాల మాదిరే కనిపిస్తుండడం నిరుత్సాహకరమైన అంశం. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఫోటో లీకై, నెట్టింట హల్చల్ చేస్తుంటే, మరో పక్కన జూనియర్ ఎన్టీఆర్ తో పాటు భద్రాచలం వెళ్ళిన కొరటాల శివ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సతీసమేతంగా జూనియర్ భద్రాచలం వెళ్ళగా, వారితో పాటు కొరటాల శివ కూడా వెంటే ఉన్నారు. గతంలో తిరుపతి వెళ్ళిన సమయంలోనూ కొరటాల ఉన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories