ఎన్టీఆర్ ‘బయోపిక్’పై తారక్ ‘సేఫ్’ కామెంట్!

Jr-NTR-Responds-About-NTR-Biopicవిశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్న విషయమూ ఇప్పటికే ఖరారైంది. దీనిపై మీ అనుభూతి తెలియజేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ కు మీడియా వర్గీయుల నుండి ఓ ప్రశ్న ఎదురైంది. ‘బిగ్ బాస్’ షో కోసం ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఎదురైన ఈ ప్రశ్నకు తెలివైన జవాబే ఇచ్చారు తారక్.

ADVERTISEMENT

ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎవరో ఒకరికి పరిమితం కాదు, తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజలంతా గర్వించే మనిషి. ఆయన బయోపిక్ తెరకేక్కుతోందంటే మంచి విషయమే కదా. అయితే ఇందులో వివాదాస్పద విషయాలు ప్రస్తావిస్తున్నారన్న విషయంపై తనకేమీ తెలియదని, మీలాగే తాను కూడా ఎదురు చూస్తున్నానని చెప్పిన జూనియర్, ఈ సినిమాలో అవకాశం వస్తే నటించాలా? వద్దా? అనేది ఏమీ ఆలోచించలేదని అన్నారు.

ఇక ఈ సినిమాలో మీ బాబాయ్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు కదా… దానిపై మీ ఫీలింగ్ ఏంటి..? అని అడుగగా, అలా అయితే ఇంకా బ్రహ్మాండం… చెప్పడానికేముంది… అంటూ చిరునవ్వు నవ్వారు. మొత్తానికి తన సమాధానాల ద్వారా తాను ఎవరికీ కార్నర్ కాకుండా చూసుకోవడంలో జూనియర్ సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. ఏ చిన్న మాట జారినా మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యేది… అయితే అలాంటి వాటికి తారక్ తావివ్వలేదు.

ADVERTISEMENT
Latest Stories