ఏప్రిల్ 8న భారత్ లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ది జంగిల్ బుక్’ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇంతవరకూ ఏ హాలీవుడ్ చిత్రం కూడా సాధించలేని భారీ వసూళ్లను రాబడుతూ ‘ది జంగిల్ బుక్’ దూసుకెళ్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు 100 కోట్ల వసూళ్లను దాటేసిందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు.
సెలవు రోజులైన శనివారం, ఆదివారాల్లో వరసగా 8.51 కోట్లు, 10.67 కోట్ల రాబట్టడంతో 100 కోట్ల మైలు రాయిని దాటి 150 కోట్ల వైపుకు పరుగులు పెడుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో అనువాదమైన ఈ సినిమా కధ సాహసం, వినోదం అంశాలతో కూడుకున్నది. ఈ చిత్ర హిందీ వర్షన్ కు బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రా, నానా పటేకర్, ఓం పురి, ఇర్ఫాన్, షేఫాలి షా వాయిస్ ఓవర్ అందించడం ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



