జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫాన్స్‌ను లేదా మెగా హీరోలను ఎప్పుడన్నా తిట్టాడా?
ఎందుకింతగా కక్ష కట్టారు?
దేవరని ఆచార్య 2 అని మొదలెట్టారు, ట్రైలర్ తో మొదలు పెట్టి రిలీజైన ఫస్ట్ డే కూడా అదే హడావిడి. స్లో గా రిజల్ట్ చూసి మన వల్ల ఇక కాదులే అని సైలెంట్ అయిపోయారు.
అలానే చరణ్ కానీ, చిరు కానీ ఎన్టీఆర్‌ను కానీ ఆయన ఫాన్స్‌ను కానీ ఎప్పుడన్నా తిట్టారా?
రెంటికీ ఆన్సర్ అందరికీ తెలిసిందే…
ఈ రెండు వర్గాల ఫాన్స్ మాత్రం వాళ్లకు వాళ్లు గిల్లుకుని, ఆ బాధని తగ్గించుకోడానికి ఎన్టీఆర్ ఫాన్స్‌ను అబ్యూస్ చేసే క్రమంలో ఎన్టీఆర్ మీద పడిపోవడం, అలానే రివెంజ్ అంటూ వీళ్ళు చిరు, చరణ్ మీద పడడం చూస్తే ఒకటి మాత్రం వాస్తవం.
ఈ హీరోలతో డబ్బు పెట్టి సినిమా తీసిన నిర్మాత, కొన్న బయ్యర్ల హార్ట్ బీట్ పెరిగిపోతూ క్రుంగి పోడం.
మొన్న దేవర ను ఆచార్య2 అని, నిన్న విశ్వంభర ను టీవీ సీరియల్ అని సినిమా కొనుకున్నాళ్లని నలిపేస్తున్నారు ఈ రెండు క్యాంపులు.




