రిలీజ్ రోజునే యూ ట్యూబ్ లో పెట్టారు!

Kaala-Song-Chittamma---Rajinikanthతమ సినిమా కోసం ధియేటర్ల వరకు ప్రేక్షకులను రప్పించడం అనేది చిత్ర నిర్మాతలకు ఓ పెద్ద సాహాసంలా మారుతోంది. ఇందుకు అగ్ర హీరోలు కూడా అతీతులు కాదన్న విషయం తాజాగా విడుదలైన “కాలా” ఓపెనింగ్స్ చెప్పకనే చెప్తున్నాయి. భారీ నెగటివ్ టాక్ తెచ్చుకోకపోవడం ఎంత ప్లస్ పాయింట్ అయ్యిందో…. భారీ పాజిటివ్ టాక్ కూడా రాకపోవడం అంతే నెగటివ్ గా మారింది. దీంతో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ రేంజ్ తెలియాలంటే మరో రెండు రోజులు చూడాల్సిందే.

ఇదిలా ఉంటే నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ రోజునే ఓ వీడియో సాంగ్ ను చిత్ర నిర్మాణ సంస్థ యూ ట్యూబ్ లో పెట్టేసారు. ‘చిట్టెమ్మ’ అనే సాంగ్ ను ఫస్ట్ షో పడే సమయానికి యూ ట్యూబ్ లో రిలీజ్ చేయడం విశేషం. ఈ సమ్మర్ లో బాక్సాఫీస్ వద్డ సక్సెస్ అయిన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాల వీడియో సాంగ్స్ ను కూడా రిలీజ్ చేసారు గానీ, మరి రిలీజ్ రోజున కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. అయితే ‘కాలా’ సినిమాలో తెలుగు సాంగ్స్ మైనస్ పాయింట్స్ లో ఒకటన్న విషయం నిర్మాణ సంస్థ మరిచినట్లుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories