కొట్టడం కాదు… ఎవరూ కొట్టలేని విధంగా కొట్టాడు..!

Kabali Premier Collections,Kabali 2 Million Overseas Collections, Kabali Movie Premier Collections,Kabali Overseas Collections,Kabali US Canada Collectionsయుఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షో కలెక్షన్స్ ను తిరగరాశాడు సూపర్ స్టార్ ‘కబాలి.’ అది కూడా ఎవరూ ఊహించలేని విధంగా..! ఆల్ టైం ఇండియన్ సినిమాల జాబితాలో ఇప్పటివరకు ‘బాహుబలి’ సినిమాదే అగ్ర స్థానం. అయితే ఆ సినిమా రికార్డులను భారీ తేడాతో బద్దలు కొడుతూ తన రీల్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద ఈ ‘భాషా’ చూపించాడు.

‘బాహుబలి’ సినిమా ప్రీమియర్ షోల వసూళ్లు 1.39 మిలియన్ డాలర్స్ వసూళ్ళు కాగా, తాజాగా ‘కబాలి’ ఏకంగా 2 మిలియన్ మార్క్ ను అందుకుని తన రేంజ్ ఏంటో మార్కెట్ వర్గాలకు చాటిచెప్పాడు. ఈ రకమైన కలెక్షన్స్ ప్రీమియర్ షోలకు అంచనా వేసింది మాత్రం కాదు. ఒక రకంగా యుఎస్ ప్రీమియర్స్ విషయంలో ‘బాహుబలి’ సినిమా రికార్డులను కూడా తాకుతుందో లేదోనన్న అనుమానం కూడా వ్యక్తమైంది.

ADVERTISEMENT

అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ యుఎస్ బాక్సాఫీస్ పై తన ‘కబాలి’ జెండా ఎగురవేసాడు రజనీ. ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ‘కబాలి’కి అభిమానులు బ్రహ్మరధం పడుతుండడం విశేషం. బహుశా ఈ ‘కబాలి’ రికార్డులను అందుకోవడం ‘బాహుబలి 2’ కైనా సాధ్యమో కాదో అనే విధంగా 2 మిలియన్ మార్క్ ను సొంతం చేసుకున్నాడు ఈ ‘కబాలి.’

ADVERTISEMENT
Latest Stories