కోట్ల రూపాయల కార్లు – కబాలి సినిమాకు ప్రమోషన్లు!

Kabali Car Stickers, Kabali Car Stickers Rajinikanth Craze, Kabali Car Stickers Promotions, Kabali Movie Car Stickers, Kabali Car Promotions సూపర్ స్టార్ అభిమానులను ‘కబాలి’ ఫీవర్ ఓ రేంజ్ లో తాకుతోంది. దీంతో బిఎండబ్ల్యూ కార్లు కూడా ‘కబాలి’ సినిమాకు పబ్లిసిటీ పోస్టర్లుగా మారిపోయాయి. కోట్ల రూపాయలు విలువైన ఓ బిఎండబ్ల్యూ కారు చుట్టూ యుఎస్ అభిమాని ‘కబాలి’ పోస్టర్లను రూపొందించగా, ఇండియాలో ఉన్న తామేం తక్కువ కాదని తమిళనాట రజనీ అభిమానులు నిరూపిస్తున్నారు.

తన విలువైన వోక్స్ వాగన్ కారు బానిట్ పై అదిరిపోయే రేంజ్ లో ‘కబాలి’ రజనీకాంత్ పోస్టర్ ను పెట్టి, కారు లుక్ నే మార్చివేశాడు ఒక అభిమాని. బహుశా ఈ ఫోటో చూస్తే వోక్స్ వాగన్ సంస్థ కూడా అధికారికంగా తమ కార్లను ఇలా విడుదల చేస్తే బాగుంటుందనే విధంగా ఈ స్టిల్ ఉండడంతో సోషల్ మీడియాలో రజనీ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT

మరో చోట తన కారుకు వచ్చిన నెంబర్ ను ‘కబాలి’గా మార్చివేశాడు మరో అభిమాని. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని తన ఆడి కారు అసలు నెంబర్ ‘కేఎ 8 ఎఎల్ 1’ను కాస్త ‘కబాలి’ అంటూ ఇంగ్లీష్ లెటర్స్ లో రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇలా కోట్లు పెట్టి కొన్న కార్లు ‘కబాలి’ సినిమాకు ప్రమోషన్లుగా మారిపోవడం బహుశా ‘సూపర్ స్టార్’ వల్ల మాత్రమే అయ్యే విషయమని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories