పాలాభిషేకాలు చేసిన చేత్తోనే ‘కబాలి’ని కట్ చేసా!

Praveen KL, Editor Praveen KL, Editor Praveen KL Kabali, Editor Praveen KL Rajinikanth, Editor Praveen KL Rajinikanth Fan, Editor Praveen KL Kabali Movieసూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పనిచేయాలన్న తన కల నెరవేరిందని ‘కబాలి’ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన తెలుగు యువకుడు కేఎల్ ప్రవీణ్ పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రవీణ్, ‘రజనీకాంత్ గారితో ఫొటో దిగడమనేదే పెద్ద కల. అలాంటిది ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం. ఈ అవకాశం వస్తుందని కూడా అనుకోలేదని’ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

‘నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్ అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ల వద్దకు వెళ్లి పాలాభిషేకాలు చేశాను. ఇప్పుడు అదే చేత్తో ఆయన సినిమాకు ఎడిటర్ గా ‘కబాలి’ని కట్ చేయడంలో ఉన్న ఆనందం వేరు.. మాటల్లో చెప్పలేను. కానీ, ‘కబాలి’ కి పనిచేసిన కొత్త టీమ్ ఎలా చేసిందనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్లు అందరికీ నచ్చాయి. అదే బాటలో సినిమా కూడా నడుస్తుందని’ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు అయ్యే వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

‘కబాలి’ తమిళ, తెలుగు వెర్షన్లు రెండూ చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నాయి. తెలుగులో రజనీకాంత్ గారికి మనో డబ్బింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదివి సినిమా ఎలా ఉండాలనుకున్నామో, అదే విధంగా ఈ సినిమా వచ్చింది. సూపర్ స్టార్ రజనీ అభిమానులను సంతృప్తిపరచడం ఒక సవాల్. ఈ చిత్రానికైనా హైప్ ఉంటుందని తెలుసు. కానీ, ఇంత హైప్ ఉంటుందనుకోలేదని చెప్పిన ప్రవీణ్, తెలుగు చిత్రాలకు కూడా ఎడిటర్ గా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు.

ADVERTISEMENT
Latest Stories