‘కబాలి’ లీక్… అంతా ప్రమోషన్ మాయ..?

Kabali Leak Controversy, Kabali Movie Leak Controversy, Kabali  Fake Leak Controversy, Kabali Leak Controversy Rumor, Kabali  Leak Controversy Fake తమ సినిమాలను జనాల్లోకి తీసుకువెళ్ళడానికి చిత్ర యూనిట్ ఎలాంటి పనికైనా ఒడిగడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే రజనీకాంత్ పేరే ఒక ప్రమోషన్ గా మారిన నేపధ్యంలో… ‘కబాలి’ సినిమా కోసమని నిర్మాతలు ఒక ప్రత్యేకమైన ఫీట్ చేసారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్ లైన్లో తమ సినిమా ‘కబాలి’ లీక్ అయ్యిందని, గత కొన్ని రోజుల క్రితం చెన్నై హైకోర్టులో చిత్ర నిర్మాతలు ఓ పిల్ వేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అదే నిర్మాతలు… సినిమా విడుదల రెండు రోజుల్లో ఉందనంగా… తమ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిన దాఖలాలు లేవని, దాదాపు 250 వెబ్ సైట్లపై నిఘా ఉంచామని, ఎక్కడా కూడా ‘కబాలి’ కనపడ లేదని ప్రకటన చేసారు. అంటే అంతకుముందు చేసినదంతా ప్రమోషన్లో భాగమా? అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తొలుత ఈ సినిమాను సెన్సార్ బోర్డు వాళ్ళే లీక్ చేసారన్న ఆరోపణలతో, ఏకంగా బోర్డు చైర్మెన్ నిహలానీ తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT

రజనీ పేరే ఒక ‘బ్రాండ్’గా తయారైన తరుణంలో… పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడాన్ని అభిమానులు సైతం సహించలేకపొతున్నారు. నిజానికి విడుదల కంటే ముందే సినిమా లీక్ అయితే, ఆ సమాచారాన్ని నిర్మాతలకు ముందుగా చేరవేసేది అభిమానులు మాత్రమే. అలా నిర్మాతల మాటలను విశ్వసించి, ఆన్ లైన్లో ‘కబాలి’ లింక్ ల కోసం అహర్నిశలు పాటు పడిన అభిమానులు… తాజాగా నిర్మాతలు చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. ఇప్పటికే ఓవర్ పబ్లిసిటీ అయ్యిందన్న విమర్శలకు, నిర్మాతల వ్యాఖ్యలు బలాన్నిచ్చేలా ఉన్నాయని చిర్రుబుర్రులాడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories