సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కబాలి” సినిమా నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను గతంలో ఓ వ్యక్తికి చెల్లించాల్సిన డబ్బును ఇంతవరకూ చెల్లించకపోవడంతో ఈ నెల 28లోగా అదుపులోకి తీసుకోవాలని నాగర్ కోవిల్ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తనకు సదరు నిర్మాత చెల్లించాల్సిన రెండు లక్షల రూపాయలను ఇవ్వడం లేదని నాగర్ కోవిల్‌కు చెందిన క్యూ థియేటర్ యజమాని డేవిడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
విచారణ జరిపిన కోర్టు 2013 లో తీర్పునిస్తూ వెంటనే ఆ డబ్బుని చెల్లించాలని థానుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, న్యాయస్థాన ఆదేశాలను థాను లెక్కచేయలేదు. దీంతో డేవిడ్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. థాను వద్ద డబ్బు ఉండి కూడా తనకు ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వడం లేదని చెప్పడంతో, దీంతో అరెస్ట్ చేసే దిశగా కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.



