‘బ్రహ్మోత్సవం’ వేడుకలో కాజల్, సమంతల సెంటిమెంట్!

Samantha white saree sentimentకాకతాళీయమో లేక సెంటిమెంట్ పరంగా అలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారేమో గానీ, “బ్రహ్మోత్సవం” సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్లు సమంత, కాజల్ లు ఓ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. ప్రిన్స్ మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల గత సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ప్రిన్స్ సరసన నటించిన సమంత… ఈ సినిమా ఆడియో వేడుకకు తెల్ల చీర మీద నలుపు అంచు బోర్డర్ ఉన్న కాస్ట్యూమ్స్ తో హాజరైంది. తాజాగా జరిగిన ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకలో కూడా ఇలాంటి చీరతోనే దర్శనమివ్వడం విశేషం.

Kajal red dress sentiment
ఇక, కాజల్ విషయానికి వస్తే… అంతకుముందు ప్రిన్స్ తో నటించిన ‘బిజినెస్ మెన్’ ఆడియో వేడుకలో ఎరుపు రంగు డ్రెస్ తో కాజల్ సందడి చేయగా, ‘బ్రహ్మోత్సవం’ వేడుకలో కూడా అదే ఎరుపు రంగు శారీతో కనువిందు చేసింది. అయితే డ్రెస్ లలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఒకే రంగుతో కాజల్ కనిపించడం కేవలం కాకతాళీయమేనా..! మరో హీరోయిన్ ప్రణీత మొదటిసారిగా మహేష్ తో నటిస్తుండడంతో పోలికలకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే కాజల్, సమంతలు అనుసరించిన సెంటిమెంట్ ‘బ్రహ్మోత్సవం’ కూడా వర్కౌట్ అయితే, ప్రిన్స్ అభిమానులకు అంతకు మించి ఏం కావాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories