“బ్రహ్మోత్సవం”లో కాజల్ క్యారెక్టర్ ‘స్పెషల్’

kajal's character special in brahmotsvam మేలో విడుదల కాబోతున్న ప్రిన్స్ మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల “బ్రహ్మోత్సవం” సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటో హల్చల్ చేస్తోంది. మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో కాజల్ దర్శనమిస్తున్న ఈ పిక్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రిన్స్ మహేష్ బాబు సింపుల్ లుక్ లో కనపడుతున్నాడు.

శ్రీకాంత్ అడ్డాల సినిమాలో హీరోయిన్లు సహజంగా సాంప్రదాయబద్ధంగానే ఉంటారు. చక్కని చీరకట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా కనపడుతుంటారు. అయితే “బ్రహ్మోత్సవం” సినిమాకు సంబంధించి ఇప్పటివరకు హల్చల్ చేసిన పలు ఫోటోలలో కాజల్ మోడ్రన్ లుక్ లోనే దర్శనమివ్వడంతో… ఈ సినిమాలో కాజల్ పాత్రను ‘సంథింగ్ స్పెషల్’గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డిజైన్ చేశారన్నది సినీ వర్గాల టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories