Kalki 2898 AD

తెలుగు, తమిళ్, మరాఠీ, బెంగాలీ ఏ సినీ పరిశ్రమలోనైనా వివిద జోనర్లలో దశాబ్ధాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో చారిత్రికం, పౌరాణికం కూడా ఉన్నాయి. నాటి తాండ్ర పాపారాయుడు, అల్లూరి సీతారామరాజు వంటి పూర్తి చారిత్రిక సినిమాలతో పాటు, వాటి ఆధారంగా అల్లుకొన్న ఆర్‌ఆర్ఆర్‌ వంటి గొప్ప చిత్రాలు చాలా వచ్చాయి.

ఇక రామాయణ, మహాభారత, భాగవతాల ఆధారంగా వచ్చిన పౌరాణిక సినిమాలకు లెక్కే లేదు. అలాగే వాటి ఆధారంగా అల్లుకొన్న యమగోల, యమలీల మొదలు బ్రో వరకు అనేక సినిమాలు వచ్చాయి. కనుక సరికొత్తగా చూపగలిగితే ప్రేక్షకులు ఎన్నిసార్లు అయినా వాటిని చూసి ఆనందిస్తూనే ఉన్నారు.

Also Read – షిప్ సీజ్ అయ్యింది…ఇక అసలు కథ మొదలయ్యింది…!

కనుక మన ఘనమైన భారతీయ చరిత్ర, అంతకు మించి ఘనమైన ఇతిహాసాలు, పురాణాలు భారతీయ సినీ పరిశ్రమకు ఓ వరం వంటివే అని చెప్పవచ్చు. వాటిని ఎవరు ఎంత గొప్పగా వాడుకుంటారనేది వారి సమర్ధతపై ఆధారపడి ఉంటుంది.

యమగోల, మాయబజార్‌తో కామెడీ చేయవచ్చు, భీష్మ, శ్రీకృష్ణార్జున యుద్దం, దానవీరశూరకర్ణలతో యుద్ధాలు చేయవచ్చు. మరోవిదంగా చెప్పుకుంటే మన భారతీయ చారిత్రిక, పౌరాణిక సినీ పరిశ్రమకు ఎన్నటికీ తరగని అద్భుతమైన కధలను అందించే అక్షయపాత్ర వంటివే అని చెప్పుకోవచ్చు.

Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?

ఇందుకు తాజా ఉదాహరణగా ప్రభాస్‌-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న కల్కి ఎడి2898 సినిమాలో అశ్వథామ పాత్ర గురించి చెప్పుకోవచ్చు. ఈ పాత్రని దేశంలో సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ చేస్తున్నారు.

అశ్వథామ అనేది కేవలం ఓ పాత్ర పేరు మాత్రమే అయితే దీని గురించి ఇంతగా చెప్పుకోవలసిన అవసరమే లేదు.

Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్‌ అనుకుంటే హరీష్ రావుతో బోణీ?

కానీ ఈ అశ్వథామ మహాభారత కాలం నాటి ద్రోణాచార్యుల కుమారుడు అని కల్కిలో ఆయన పాత్రని పరిచయం చేయడంతో ఆ పాత్ర, సినిమా కధ డెప్త్ అనూహ్యంగా పెరిగిపోయింది.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వథామ పాండవుల కోడలు ఉత్తర గర్భంలోని శిశువుని తన అస్త్రంతో చనిపోయేలా చేస్తాడు. అందుకు కోపించిన శ్రీకృష్ణుడు అశ్వథామకు నుదుటపై సహజసిద్ధంగా ఉన్న అపూర్వమైన శక్తులు కలిగిన మణిని తొలగించి, ‘రక్తం కారుతూ కంపు కొట్టే శరీరంతో ఆకలి దప్పులతో కృశించిపోతూ మనుషులకు దూరంగా ఈ భూమ్మీదే బ్రతుకు’ అని శపిస్తాడు.

అప్పుడు అశ్వథామ శ్రీకృష్ణుడిని ప్రార్దించి శాపవిమోచనం కల్పించమని వేడుకోగా కలియుగంలో తాను మళ్ళీ అవతరించినప్పుడు విమోచనం కలుగుతుందని చెప్తాడు.

మహాభారత కాలంనాటి అశ్వథామ పాత్రను, ఆనాటి ఈ ఘటనలను దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న తన కల్కి ఎడి2898 సినిమాకు ఈవిదంగా వాడుకోవడం చాలా గొప్ప ఆలోచనే అని చెప్పవచ్చు.

కల్కి ఎడి 2898 ఈ పౌరాణిక పాత్ర, కధని కూడా జోడించడంతోనే ఈ సినిమా డెప్త్ చాలా పెరిగింది. అశ్వథామ పాత్రని పరిచయం చేయడం కంటే చాలా ముందు నుంచే ఇటువంటిదేదో ఈ సినిమాలో ఉండబోతోందని దర్శకుడు నాగ్ అశ్విన్ సూచిస్తూనే ఉన్నాడు. అది ఇంత గొప్పగా ఉంటుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. సినిమాలో అశ్వథామ పాత్ర ఉంది కనుక దాంతో కనెక్ట్ అయ్యే అద్భుత శక్తులు కలిగిన మరి కొన్ని పాత్రలు కూడా తప్పక ఉంటాయి. అంటే ఈ సినిమా సూపర్ హీరో పరిధికి మించినదే అని భావించవచ్చు. అది మన ప్రభాస్‌ కావడం మనకీ సంతోషమే కదా?

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాతో ఇటువంటి ప్రయోగమే చేసి విజయం సాధించాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఈ రెంటినీ (పురాణికం, సైన్స్ ఫిక్షన్) చక్కగా జోడించి చూపగలిగితే కల్కి ఎడి2898 భారతీయ సినీ పరిశ్రమని మరో స్థాయికి తీసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.