దుబాయ్‌లో బతుకమ్మకు బీఆర్ఎస్‌ నేతలు.. కవిత ఏమంటారో?

Kalvakuntla Kavitha faces a political setback as KTR receives the Dubai Bathukamma invitation and BRS leaders prepare to attend the celebrations.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి మొదలవుతాయి. ఇదివరకు బతుకమ్మ పండుగ, ఆ వేడుకలకు కల్వకుంట్ల కవిత ‘ఐకాన్’లా కనిపించేవారు.

కేసీఆర్‌ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్‌ అన్నట్లుగా, ఒకానొక సమయంలో బతుకమ్మ అంటే కల్వకుంట్ల కవిత… ఆమె అంటే బతుకమ్మ అనే స్థాయిలో ప్రచారం జరిగింది.

ADVERTISEMENT

విదేశాలలో స్థిరపడిన తెలంగాణవాసులు కూడా తెలంగాణ జాగృతి పేరు అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను జరుపుకునేలా ఆమె ప్రోత్సహించారు. వాటి కోసం ఏటా ఆమె విదేశాలకు వెళ్ళి వస్తుండేవారు.

అయితే ఆమె బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడి, టీఆర్ఎస్‌ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నప్పటి నుంచి విదేశాలలో బతుకమ్మ వేడుకలు ఆమెకు మధుర జ్ఞాపకాలుగా, గత వైభోగంగా మిగిలిపోయాయి.

దుబాయ్‌లో తెలంగాణవాసులు జరుపుకోబోతున్న బతుకమ్మ వేడుకలకు ఈసారి ఆమెకు ఆహ్వానం రాలేదు. కేటీఆర్‌కు వచ్చింది. కనుక ఆయన సూచన మేరకు బీఆర్ఎస్‌ ముఖ్య నేతలు వాటిలో పాల్గొనేందుకు దుబాయ్‌ బయలుదేరుతున్నారు.

తాను బీఆర్ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడే తనని, తన జాగృతిని, తన రాజకీయ జీవితాన్ని హరీష్‌ రావు వంటివారు కట్టడి చేశారని కల్వకుంట్ల కవిత తరచూ ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న అవకాశాన్ని కూడా ఆమె చేతిలో నుంచి బీఆర్ఎస్‌ పార్టీ లాగేసుకుంటే ఏమంటారో?

ADVERTISEMENT
Latest Stories