Kalvakuntla-Kavithaనేటి రాజకీయాలలో విలువలు.,సేవాతత్పరితం., మానవీయకోణాలు ఆశించడం అత్యాశే అవుతుందేమో. ఈతరం రాజకీయ నేతలు.., ప్రజలు..,రాజకీయాలను చూసే విధానమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం.., ప్రతిపక్షాలు అధికార పార్టీ వారు మా పై కక్ష్య సాధింపు కోసమే ఈ అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని లొంగ తీసుకోవాలి భావిస్తున్నారు అంటూ చెప్పడం అటు రాజకీయ నాయకులకు….వాటిని వినడం ఇటు ప్రజలకు అలవాటుగా మారిపోయిది.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత పై కేంద్ర బీజేపీ నాయకులు ఢిల్లీ లో కవిత ‘లిక్కర్ స్కాం’ అంటూ ఆమె పై చేసిన ఆరోపణలకు జవాబుగా కవిత కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బీజేపీ పార్టీ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేసులు పెట్టటం.., ఆ కేసులకు లొంగిపోయి నేతలు బీజేపీకి మద్దతు పలకడం ఈ కాలంలో తరచు చూస్తూనే ఉన్నాం అంటూ కొందరు నేతలను ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు.

మమతా మీద పోటీచేసిన సువేంద్ర.., మధ్యప్రదేశ్ ఎంపీ శివరాజేసింగ్ చోహాన్ వ్యాపం స్కాం.. రెడ్డి బ్రదర్స్ .,యడ్యూరప్ప., యూనియన్ మినిస్టర్ రమేష్ పొక్రియాల్., ముకుల్ రాయల్.., నారాయణ రాణే., సీంద్యా ఇలా ఎందరో నాయకుల మీద కేసులు పెట్టి ఇప్పుడు బీజేపీలో చేరిన తరువాత మాత్రం వారి మీదకు ఈడీ రాదు., ఐటీ రాదు., సీబీఐ రాదు అంటూ పెద్ద లిస్టే చెప్పుకొచ్చారు.

అయితే పక్కనే ఉన్న మీ అన్న జగన్ మోహన్ రెడ్డి సంగతేంటి అంటూ సదరు వ్యాఖ్యాత ప్రశ్నించగా నవ్వుతు తెలుగోళ్ళ గురించి మనకెందుకు అంకుల్ అంటూ మాటదాటేస్తూ జగన్ మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు కవిత. జగన్ అక్రమాస్తుల కేసులను అడ్డంపెట్టుకుని బీజేపీ కూడా రాష్ట్రానికి కేంద్ర నుండి చేయాల్సిన పనులను దాటేస్తూ వస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినపడుతున్న మాట.జగన్ కూడా తన పార్టీ వైసీపీ నుండి కేంద్రం లో బీజేపీకి అవసరమైనప్పుడల్లా తన మద్దతుని తెలుపుతూనే ఉన్నారు.

అయితే కవితకు పాపం జగన్ గుర్తురాలేదో లేక పరోక్షంగా జగన్ తమకు, తమ పార్టీకి చేసిన మేలు గుర్తొచ్చిందో కానీ జగన్ గురించిన ప్రస్తావనను కూడా తన సంభాషణలో రానీయకుండా చాల జాగ్రత పడింది. పరోక్షంగా తమ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న జగన్ పట్ల కవిత ఆమాత్రం ప్రేమ చూపించడం పెద్ద వింతేమీ కాదంటున్నారు జగన్ వ్యతిరేక వర్గం. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వందల కోట్ల ఆంధ్ర ప్రాంత ఆస్తులను ఒకేఒక్క సంతకంతో తెలంగాణ రాష్ట్రానికి దారాదత్తం చేసిన వ్యక్తి పట్ల ఆ మాత్రం విశ్వాసం కనపరచడం తప్పులేదేమో.

రాజధాని లేని రాష్ట్రంగా చేసి రాష్ట్రాన్ని మార్చి వచ్చిన పెట్టుబడులను తిరిగి వెనకకు పంపి., మరో పెట్టుబడి దారులను ఇటువైపు చూడకుండా జగన్ చేస్తున్న కక్ష్య పూరిత రాజకీయాలను పరోక్షంగా తెరాస నేతలు సమర్దిస్తుంటారు. తద్వారా రాష్ట్రంలో వ్యాపారాలు కుంటుపడం.., ఆవ్యాపారస్తులు పక్క రాష్ట్రాల వైపు చూస్తుండడం తెలంగాణకు కలిసొచ్చేఅంశం. 2014 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఉపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవత్ తెలుగు ప్రజలను ఇటువైపు చూసేలా చేసింది. కానీ ఇపుడా పరిస్థితి లేదు.

ఒక్క రియల్టర్ల రంగమే కాదు అన్ని వ్యవస్థలు ఒక్క సారిగా కుదేలయ్యాయి అనే వాస్తవాన్ని తోటి రాష్ట్రాలు సైతం బహిరంగంగానే ప్రస్తావిస్తున్నాయి. తెరాస ముఖ్య నేతలలో ఒకరైన హరీష్ రావు పలు సందర్భాలలో ఈ విషయాన్నీ ప్రస్తావించారు. 2019 ఎన్నికలకు గాను చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే జగన్ – కేసీఆర్ ల మధ్య ఉన్న సాన్నిహిత్య సంబంధాలు బయటపడ్డాయి.

తండ్రికి సన్నిహితుడైతే మరి కూతురు కూడా సమర్ధించక తప్పదు కదా. ఒకప్పుడు తెలంగాణ ద్రోహి జగన్ అంటూ రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా రైల్వే స్టేషన్ లోనే తెలంగాణ యువతతో.., తెరాస కార్యకర్తలతో రాళ్ల దాడి చేపించిన సంఘటనలు రాజకీయ క్రీడలో కొట్టుకుపోయి.., ఇప్పుడు కనీసం చిన్న పాటి విమర్శకు సైతం మాట దాటేసే పరిస్థితికి కవిత వచ్చారంటేనే తెలుస్తుంది రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా సాధ్యమే అని. రాజకీయాలలో శాశ్వత శత్రువులు.., శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరని. ఈ రాజకీయ నాయకుల గొడవల మధ్య నలిగిపోయేది సామాన్య కార్యకర్తలు..,అమాయక ప్రజలు మాత్రమే అనేది అందరు తెలుసుకోవాల్సిన అంశం.