కమల్ కు కనపడుతోంది… వీరిద్దరికీ వినపడుతోంది..!

Kamal Haasan praises chandrababu naiduకేంద్రం సహకరించకపోయినా… లోటు బడ్జెట్ తో ఆర్ధికంగా కొట్టుమిట్టాడుతున్నా… ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడంలో చంద్రబాబు ఎంతగా సక్సెస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్న నగరాలు సుందరీకరణ చేస్తోన్న బాబు పాలనకు ప్రజలు ఎలా నీరాజనాలు పలుకుతారు అనేది వచ్చే ఏడాది తెలియనుంది.

[m9ad]

ADVERTISEMENT

ఇంత జరుగుతున్నా ఏపీలో ఏం జరగట్లేదు… అంతా అవినీతి తప్ప..! అంటూ జగన్, పవన్ లు ఎత్తుకున్న పల్లవిలు బహిరంగమే. వారి రాజకీయ అజెండా వారికుంది గనుక, రాష్ట్రంలో జరుగుతోన్న పాలనను ప్రశంసించడానికి మాటలు రావడం లేదు. అయితే పొరుగున ఉన్న వారు మాత్రం చంద్రబాబు నాయుడుకే ఆ సామర్ధ్యత ఉందంటూ కమల్ హాసన్ లాంటి వారు బహిరంగంగానే చెప్తున్నారు.

నాన్ బిజెపి, నాన్ కాంగ్రెస్ లను ఐక్యత చేయగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని, ఏపీని అభివృద్ధి చేస్తోన్న తీరు ఇందుకు నిదర్శనమని కొనియాడుతూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు పాలనను గురించి కమల్ హాసన్ ప్రత్యేకించి ప్రశంసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే… ఏపీలో అభివృద్ధి కమల్ కు కనపడుతుంటే, అలాంటి వాళ్ళు చెప్పిన మాటలు జగన్, పవన్ లకు వినపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories