హరికృష్ణతో… తప్పుచేసారు… మూల్యం చెల్లించుకున్నారు..!

Kamineni hospitals dismissed -Selfie with Harikrishna Deadbody-హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకున్న నలుగురు సిబ్బందిపై వేటేసినట్టు కామినేని ఆసుపత్రి ప్రకటించింది. ఇది అమానుష, అనాగరిక ప్రవర్తన వల్ల జరిగిన తప్పిదమని, జరిగిన తప్పుకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు పేర్కొంది. ఆసుపత్రిలో ఉన్న హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీ తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ తప్పిదంలో పాల్గొన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు స్పష్టం చేసింది. మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

[m9ad]

ADVERTISEMENT

ఆసుపత్రిలోని కొందరి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఆసుపత్రి తరపున హరికృష్ణ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందిన అనంతరం ఆసుప్రతికి చెందిన ఇద్దరు వార్డు బాయ్‌లు, ఇద్దరు నర్సులు సెల్ఫీ తీసుకున్నారు.

వీరిలో ఒకరు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయి చివరికి మీడియాకు చేరింది. సెల్ఫీపై పదే పదే కథనాలు ప్రసారం చేయడం, అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సెల్ఫీపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో స్పందించిన కామినేని ఆసుపత్రి యాజమాన్యం… జరిగిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు తీసుకున్న నలుగురినీ తొలగించింది. సెల్ఫీ క్రేజ్ ఉండొచ్చు గానీ, అది ఎక్కడ వినియోగించుకోవాలో, ఎక్కడ వాడకూడదో తెలియాలి కదా!

ADVERTISEMENT
Latest Stories