కంగువ-కంగుమనిపిస్తే…మట్కా-మ్యాజిక్ చేయలేకపోయింది..!

Matka Kanguva

ఎన్నో వ్యవప్రయాసాలకు ఓర్చి, ఎంతో కష్టపడి, తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అనే నమ్మకంతో సినిమాలను తెరకెక్కిస్తారు దర్శక నిర్మాతలు. అలాగే తమను అభిమానించే అభిమానులకు వినోదంతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తున్నాం అనే ఆశతో నటిస్తుంటారు నటీనటులు.

ADVERTISEMENT

అయితే ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు సినిమా లేకపోతే దాని బడ్జెట్ ఎంతా, ఆ హీరో వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆలోచించి సినిమాలు చూసే రోజులు పోయాయి. అలాగే చిన్న సినిమాలైనా, డబ్బింగ్ మూవీస్ అయినా కథ కథనం బాగుంటే పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాయి అని చేసి చూపిస్తున్నాయి.

అందుకు ప్రత్యక్ష ఉదాహరణ భారీ బడ్జెట్ తో రూపొందిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్, మెగా బ్రాండ్స్ చిరు, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ కానీ, శివ కారికేయ ‘అమరన్’ కానీ బాక్స్ ఆఫీస్ వద్ద వాటి స్థాయికి మించి వసూళ్లు రాబట్టాయి.

ఇప్పుడు ఈ కోవలోకే వర్సటైల్ యాక్టర్ సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి కూడా ఎక్కడా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. కనీసం ఈ సినిమా గట్టి ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. ప్రమోషన్స్ మీద పెట్టిన శ్రద్ద సినిమా మేకింగ్ మీద పెట్టి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది అనే టాక్ బయట నడుస్తుంది.

అలాగే వరుస అపజయాలతో కెరీర్ నెట్టుకొస్తున్న వరుణ్ తేజ్ మట్కా తో తిరిగి ఫామ్ లోకి వస్తారు అని అటు మెగా అభిమానులతో పాటుగా వరుణ్ తేజ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి వచ్చిన వరుణ్ మట్కా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఇకనైనా వరుణ్ తానూ ఎంచుకునే కథల పై కాస్త శ్రద్ద పెట్టాల్సి అవసరం, ఆవశ్యకత రెండు అత్యవసరమని చెప్పకనే చెప్పారు ప్రేక్షకులు.

కంగువాతో పాన్ ఇండియా హిట్ అందుకుని తన స్థాయిని మరో మెట్టు ఎక్కించుకోవాలి అని ఆశపడిన హీరో సూర్య కు ఆ చిత్ర బృందానికి ఆడియెన్స్ కంగుతినిపించారు….తన వరుస ఫ్లాప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి తన సినీ కెరీర్ కు ఒక మంచి బ్రేక్ ఇస్తుందనుకున్న వరుణ్ మట్కా మ్యాజిక్ చెయ్యలేకపోయింది.

ADVERTISEMENT
Latest Stories