‘ఐఫిల్ టవర్’ ఏంటి ‘సెల్ టవర్’లా ఉంది అన్న హీరో!

Karthi about eiffel towerప్రపంచ ప్రసిద్ధి పొందిన పారిస్ లోని ‘ఐఫిల్ టవర్’ అంటే తెలియని వారుండరు. అత్యంత ఎత్తైన టవర్ గా కీర్తి గడించిన దీనిని వీక్షించడానికి ప్రపంచం నలువైపులా అనేక మంది పర్యాటకులు క్యూలు కడతారు. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా… సినీ హీరోలకు ఇలాంటి ప్రాంతాలను సందర్శించడం బహు తేలిక. ఆ అవకాశం “ఊపిరి” చిత్రం ద్వారా హీరో కార్తికి లభించినట్లయ్యింది.

ADVERTISEMENT

అయితే ఇప్పటికే ఐఫిల్ టవర్ ను చూసేసిన ‘ఊపిరి’ సినిమా మరో హీరో నాగ్, హీరోయిన్ తమన్నాలు ‘ఐఫిల్ టవర్’ విశిష్టత గురించి కార్తికి చెప్పడంతో భారీ అంచనాలు పెట్టుకున్న కార్తి ఎట్టకేలకు ఆ అద్భుతం ముందు నిల్చున్నాడు. ఒక్క నిముషం పాటు అలా ఆ టవర్ ను వీక్షించిన తర్వాత “ఐఫిల్ టవర్ ఏంటి సెల్ టవర్ లా ఉంది” అంటూ కార్తి అనడంతో పగలబడి నవ్వడం అక్కడున్న నాగ్, తమన్నాల వంతయ్యింది.

చిత్ర ప్రమోషన్ లో భాగంగా సదరు విశేషాలన్నీ చెప్తూ మీడియా వర్గాల్లో సందడి చేస్తున్నారు నాగ్, తమన్నాలు. ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ ఎంతో విశ్వాసంతో ఉంది. మరి ప్రేక్షకులు ఎటువంటి తీర్పు ఇస్తారో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories