‘సర్ధార్’ బాటలోనే నడుస్తున్న ‘కాటమరాయుడు’

Katamarayuduపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” ఫలితం ఎలా ఉన్నా, ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పడ్డ కుస్తీపాట్లు అన్ని ఇన్ని కావన్న విషయం తెలిసిందే. ఆడియో విడుదల రోజునే రిలీజ్ డేట్ ప్రకటించగా, నాటికి మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉండడంతో, రెండు యూనిట్లు పనిచేశాయి. ఒక యూనిట్ ఏకంగా దర్శకుడు లేకుండా స్విస్ లో పవన్ కళ్యాణే కొరియోగ్రఫీ చేసి పాటలు చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చాయి.

ADVERTISEMENT

అయితే ఇది గతేడాది సమ్మర్ నాటి సంగతి. ప్రస్తుతం మార్చి 24వ తేదీకి ‘కాటమరాయుడు’ సిద్ధమవుతోంది. ఇంకా పట్టుమని నెల రోజుల సమయం కూడా లేదు. ఇంకా మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ‘సర్ధార్’ మాదిరే ఈ మూడు పాటలను కూడా పవన్, శృతిహాసన్ లపై విదేశాలలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లానింగ్ ప్రకారం పూర్తి చేస్తే క్వాలిటీలో రాజీపడాల్సిందే అన్న విషయాన్ని ‘సర్ధార్’ చెప్పకనే చెప్పింది. దీంతో ‘కాటమరాయుడు’ పాటలు కూడా చిత్రీకరణ పరంగా క్వాలిటీ లేకుండా వస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories