శృతిహాసన్ తో ‘ఏదో’ చెప్తోన్న ‘కాటమరాయుడు’

katamarayudu-movie-stills-review-talk-shruthi-haasan-pawan-kalyanపవర్ స్టార్ గా సినీ రంగంలో, ‘జనసేన’ అధినేతగా రాజకీయ రంగంలో రాణిస్తున్న పవన్ కళ్యాణ్, రెండు రంగాలలో రాణించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ‘జనసేన’ పార్టీ తరపున స్వయంగా తెలుగులో సంతకం చేసి మరీ ఓ లెటర్ ప్యాడ్ ను విడుదల చేసిన పవన్, ‘కాటమరాయుడు’ సినిమా స్టిల్ ను విడుదల చేసి సినీ అభిమానులకు క్రిస్మస్ కానుకను ఇచ్చారు.

హీరోయిన్ శృతిహాసన్ తో పవన్ కళ్యాణ్ ఏదో చెప్తున్నట్లుగా ఉన్న స్టిల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇంటి లోపల తీసిన ఈ స్టిల్ లో ఫుల్ షేవ్ చేసుకుని పవర్ స్టార్ అదిరిపోయే లుక్ ఇవ్వగా, ‘గబ్బర్ సింగ్’ మాదిరి లంగావోణీ గెటప్ లో హీరోయిన్ శృతి కన్నులవిందు చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’తో శృతి ఫేట్ మారిపోయిన తర్వాత, మళ్ళీ పవన్ కాంభినేషన్ లో నటిస్తోన్న చిత్రం కావడంతో, అంతకుమించిన విజయం సొంతం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories