భారీగా చిన్న సినిమా…సో సోగా పెద్ద సినిమా!

Kavacham - Subramanyapuramఇది రెండు సినిమాల కధ. ఈ రెండు సినిమాలు రేపే విడుదల అవుతూ ఉన్నాయి. అయితే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ విశేషాల్లోకి వెళితే ఈ రెండు సినిమాల్లో ఒకటి అక్కినేని సుమంత్ నటించిన సుభ్రమణ్యపురం కాగా…మరొకటి బెల్లంకొండ వారసుడి కవచం.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ రెండింటిలో నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సుబ్రమణ్యపురం ఓవర్సీస్ లో దాదాపుగా 90 చోట్లకి పైగా విడుదల అవుతూ ఉండడంతో…28 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కవచం మాత్రం కేవలం 13 చోట్లే విడుదల అవుతూ ఉంది. ముందుగా అసలు ఈ సినిమా యూఎస్ లో విడుదల లేదు అన్న వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమాని అక్కడ కూడా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఈ రెండు సినిమాల్లో కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే సుబ్రహ్మణ్య పురం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి…కానీ భారీ హిట్ టాక్ వస్తే తప్పా కవచం సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉండవ్ అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియాలి అంటే మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories