కవిత విశ్వసనీయత అప్పుడే ప్రశ్నార్ధకం!

Kavitha faces credibility crisis in Telangana politics

కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ సంగతి కాసేపు పక్కన పెడితే, కల్వకుంట్ల కవిత తనకు చాలా క్లీన్ ఇమేజ్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ప్రజలను నమ్మిస్తూ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.

కానీ బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఆమెపై చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఆమె వెనుక కాంగ్రెస్‌, బిజేపిలున్నాయని చేస్తున్న విమర్శలతో ఆమె రాజకీయ ప్రయాణం ఇంకా మొదలుపెట్టక మునుపే విశ్వసనీయత దెబ్బ తింటోంది.

ADVERTISEMENT

ఆమె కూడా తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌లాగే అతిశయంతో తనకు తాను క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తే తనకు క్లీన్ ఇమేజ్ ఉందని లేదా క్లీన్ ఇమేజ్ పెరుగుతుందని ఆమె భావిస్తున్నట్లున్నారు.

కానీ కేసీఆర్‌ హయంలో జరిగిన అవినీతి భాగోతాలను ఆమె బయటపెడుతుంటే ప్రజలు ఏవిధంగా నమ్ముతారో, అదేవిధంగా కేసీఆర్‌ తరపున బీఆర్ఎస్‌ నేతలు ఆమె అవినీతి భాగోతాలు బయటపెడుతుంటే ప్రజలు తప్పక నమ్ముతారు కదా? అప్పుడు ఈ సెల్ఫ్ సర్టిఫైడ్ క్లీన్ ఇమేజ్ పోతుంది కదా?

బీఆర్ఎస్‌ చేస్తున్న అవినీతి ఆరోపణలతో ఆమె విశ్వసనీయత క్రమంగా కోల్పోతూనే ఉంటారు కదా? కవిత, బీఆర్ఎస్‌ పార్టీ మద్య మున్ముందు ఈ యుద్ధం ఇంకా తీవ్రమైతే ఇంతవరకు సామాన్య ప్రజలకు తెలియని వారి అవినీతి భాగోతాలను వారి నోటితోనే చెప్పుకోవడం మొదలుపెడితే ఏమవుతుంది?

కానీ ఎంతో రాజకీయ పరిణతి ఉన్న కల్వకుంట్ల కవిత విశ్వసనీయత ఉన్నా లేకపోయినా తన మాటకారితనం, ఎదురుదాడితోనే రాజకీయాలలో నెగ్గుకు రాగలనని గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి రాణించగలనని గట్టిగా నమ్ముతున్నారు.

కానీ విశ్వసనీయత కోల్పోతే కేసీఆర్‌ అంతటివారు పతనమైనప్పుడు తన పరిస్థితి ఏమిటి? అని ఆమె ఆలోచిస్తే భిన్నమైన రాజకీయ మార్గంలో ముందుకు సాగేవారు.

ADVERTISEMENT
Latest Stories