వైసీపీ ని ఫాలో అవుతున్న బిఆర్ఎస్.?

Kavitha Suspended from BRS, Resigns from MLC Post

బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా ఇలా బిఆర్ఎస్ పార్టీలో వరుస సంచలనాలు నమోదైన తరుణంలో తెలంగాణ రాజకీయాలు మొత్తం కవిత vs గులాబీ సేన అన్నట్టుగా సాగుతున్నాయి.

బిఆర్ఎస్ కీలక నాయకులు, మాజీ మంత్రుల పై కవిత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయగా, కవిత చుట్టూ బిఆర్ఎస్ గులాబీ ముళ్ళు గుచ్చుతోంది. ఇలా బిఆర్ఎస్ – కవిత అన్నట్టుగా సాగుతున్న విమర్శల బాణాలతో తెలంగాణ రాజకీయం తడిచి ముద్దవుతుంది.

ADVERTISEMENT

ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ పై ఆ పార్టీ ముఖ్య నేతల పై కవిత చేస్తున్న ఆరోపణలకు మౌనంగా ఉన్న బిఆర్ఎస్ ఇక తన మౌనాన్ని వీడి, రక్త బంధాన్ని మరచి కవిత మీద తనదైన రాజకీయం మొదలుపెట్టింది.

గత కొంతకాలంగా గులాబీ కండువాను పక్కన పెట్టి జాగృతి కండువాలతో రాజకీయం నడుపుతున్న కవిత కు ఆ జాగృతినే దూరం చేసే ప్రణాళికలు వేస్తుంది బిఆర్ఎస్. అందులో భాగంగానే కవిత నడుపున్న జాగృతి మీద హక్కు మాదంటూ కొందరు, ఆ జాగృతి లో అవినీతి జరుగుతుందంటూ మరికొందరు కవిత టార్గెట్ గా విమర్శలు మొదలుపెట్టారు.

అలాగే బిఆర్ఎస్ కు మద్దతుగా ఉండే మీడియా ఛానెల్స్, బిఆర్ఎస్ సోషల్ మీడియా కవిత పై విమర్శలు ఎక్కుపెడుతూ జాగృతి పేరు మీద జరుగుతున్న వివాదాలను పోస్టులుగా ప్రచారం చేస్తూ కవితను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పరిణామాలన్నీ గమనిస్తే గతంలో వైసీపీ ని కాదని షర్మిల కాంగ్రెస్ గూటికి చేరినప్పుడు కూడా వైసీపీ ఇదే మాదిరి షర్మిల మీద సొంత మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేలా చేసింది, అలాగే వైసీపీ సోషల్ మీడియా కూడా షర్మిల టార్గెట్ గా అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయింది.

గతంలో షర్మిల మీద నోరెత్తితే విరుచుకుపడే వైసీపీ, ఇప్పుడు అదే షర్మిల పై నోటితో పలకలేని భాషతో ఆమె పై వ్యక్తత్వ హనానికి పాల్పడుతుంది. ఇప్పుడు బిఆర్ఎస్ ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ కవితకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చెయ్యడం మొదలుపెట్టింది.

అలాగే కవిత పట్ల తీన్మార్ మల్లన్న వంటి నేతలు చేసిన నీచ విమర్శల పై కూడా బిఆర్ఎస్ మౌనంగానే ఉండిపోయింది. దీనితో బిఆర్ఎస్ వైసీపీ ని ఫాలో అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. నాడు అన్న వదిలిన బాణం అంటూ తిరిగిన చెల్లి పై నేడు అదే అన్న నిప్పులు చెరుగుతున్నారు. అలాగే నాడు బిఆర్ఎస్ ముద్దు బిడ్డ కవిత అంటూ ప్రచారం చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు అదే కవితను బిఆర్ఎస్ మృత్యువు అంటూ ఎండగడుతున్నారు.

అయితే రాజకీయాలలో విభేదాలు వస్తే రక్త సంబంధాన్ని కూడా ఇలా బజారున పెడతారా.? అన్న – చెల్లి, తల్లి – బిడ్డ, తండ్రి కూతురు ఇలా ఏ అనుబంధానికైనా సమాధి కడతారా.? అన్న ఈ ప్రశ్నలు కేవలం జగన్ , కేసీఆర్, కేటీఆర్ లకు మాత్రమే కాదు షర్మిల, కవితకు కూడా వర్తిస్తాయిఅనేది గ్రహించాలి.

ADVERTISEMENT
Latest Stories