“ఎవడు బక్కగా ఉన్నడో వారి పక్షాన అంబేద్కర్ నిలబడి పోరాడిండు… కేసీఆర్ కూడా బక్కగనే ఉన్నడు…. కేసీఆర్ బక్కోడే… అంటే శ్రీహరి గారు నవ్వుతాండు… బక్కగా ఉండి కొట్లాడినా… అంబేద్కర్ గారి ఆశీర్వచనం ఉంది గాబట్టి, రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన చట్టం ఉంది గాబట్టి, అంబేద్కర్ దయ వల్ల నేను బక్కగా ఉన్నా… తెలంగాణా రాష్ట్రం మనం సాధించుకోగలిగినం” అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించగానే, సభ అంతా నవ్వులతో నిండిపోయింది.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన కన్న కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించగా, బోరబండలో ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.



