కేసీఆర్ మనవడు… ఓ షార్ట్ ఫిల్మ్ హీరో!

KCR grandson himnshu turns heroసమాజంలో జరుగుతున్న దురాగతాలపై ప్రజలను జాగృతం చేసేందుకు ‘యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్’ అనే సంస్థ ‘సూపర్ హార్ట్’ పేరుతో ఆరు నుంచి పది నిమిషాల నిడివి గల ఓ షార్ట్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది. ‘ఏషియన్ స్ట్రాంగ్ మ్యాన్’గా పేరుగాంచిన మనోజ్ చోప్రా విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, వివిధ దేశాలకు చెందిన ఏడుగురు చిన్నారులు హీరోలుగా నటిస్తున్నారు. ఈ ఏడు హీరో పాత్రల్లో ఓ పాత్రకు కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు ఎంపికయ్యాడు.

ADVERTISEMENT

యూ.ఎన్.డబ్ల్యూ.టీ.ఓ. షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా ఆదివారం నాడు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్ర నిర్మాణం లాంఛనంగా ప్రారంభమైంది. ‘సూపర్ మ్యాన్’ తరహా ఫైట్లు ఉండనున్న ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ లో మార్చి 22 నుండి హిమాన్షు భాగస్వామి కాబోతున్నాడు. కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న సమయంలో అంతగా కనిపించని మనవడు హిమాన్షురావు ఇటీవల కాలంలో బాగా సందడి చేస్తున్నాడు. గతేడాది వినాయకచవితికి, మొన్నటి అయుత మహా చండీయాగం, తాజా కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఏకంగా స్నేహితులతో కలిసి సచివాలయంలోని తన తాత ఛాంబర్ లో సందడి చేస్తూ వార్తల్లో నిలిచాడు.

ADVERTISEMENT
Latest Stories