తెలంగాణలోని కొత్త సచివాలయంతో చంద్రబాబు పతనానికి స్కెచ్ వేశారా?

KCR_Chandrababu Naiduతెలంగాణలో అక్కడి ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చెప్పటినప్పుడు దాని ఎస్టిమేషన్ కేవలం 300 కోట్లు. ఇంద్రభవనం లాంటి సచివాలయానికి తెలంగాణలో 300 కోట్లే అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయానికి ఎక్కువ ఎందుకు అవుతుంది అంటూ అప్పట్లో చాలా మంది చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం అప్పుడు చెప్పిన లెక్కలకు ఇప్పుడు నడుస్తున్న తంతుకు పొంతన లేదు. కనీసం ఒక ఇటుక కూడా పడకుండానే సచివాలయం ఎస్టిమేషన్ 700 కోట్లకు చేరింది. ఈ 700 కోట్లు కేవలం సివిల్ వర్క్ కే పార్కులు, ఇన్నర్ రోడ్లు, హెలిప్యాడ్ వంటి ఇతర నిర్మాణాలకు ఖర్చు అదనం.

ADVERTISEMENT

అలాగే ఇంటీరియర్ వర్క్ ఖర్చు కూడా భారీగానే ఉంటుందని, అయితే సివిల్ వర్కు పూర్తి అయ్యాకే దాని మీద క్లారిటీ వస్తుందని అంటున్నారు. పూర్తయ్యే నాటికి 1,200 కోట్లకు అయితే బాగా అయినట్టే అని ప్రభుత్వంలోని కొన్ని వర్గాలే అనధికారికంగా చెప్పడం గమనార్హం.

అయితే తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేని కారణంగా అడిగేవారు లేరు. చంద్రబాబుని ఇరుకున పెట్టే విధంగా కావాలని అప్పుడు తగ్గించి చెప్పారో లేక కేసీఆర్ 1200 కోట్లు అంటే ప్రజలు ఆమోదించరు అని చెప్పారో తెలియదు. మొత్తానికి ఆ ఇష్యూని ఆంధ్రప్రదేశ్లోని అప్పటి ప్రతిపక్షం బాగా ఉపయోగించుకుంది.

ADVERTISEMENT
Latest Stories