చంద్రబాబుకు ధీటుగా కేసీఆర్ ప్లానింగ్!

kcr master plan to compete chandrababuరాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించగా, ఆర్థిక లోటుతో పేద రాష్ట్రంగా ఏపీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. 13 జిల్లాల ఏపీ తొలి బడ్జెట్ ను (2014-15) లో 1,11,824 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టగా, తెలంగాణ తొలి ప్రయత్నంలోనే 1,00,637 కోట్లతో లక్ష కోట్ల మార్కును అందుకుంది. అలాగే మలి బడ్జెట్ (2015-16)లో ఏపీని దాటేసిన తెలంగాణ 1,15,689 కోట్లతో ముందుకు రాగా, ఏపీ 1,13,049 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. తాజాగా ఇరు రాష్ట్రాలు 2016-17 బడ్జెట్ కసరత్తులు ప్రారంభించాయి.

రెండో బడ్జెట్ లోనే 13 జిల్లాల ఏపీని దాటేసిన 10 జిల్లాల తెలంగాణ… తన భారీతనాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపుతోంది. ఈ మేరకు బడ్జెట్ కసరత్తులు ప్రారంభానికి ముందే అధికారులతో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గతేడాది బడ్జెట్ లో ఏపీకి, తెలంగాణాకు తేడా కేవలం 2 వేల కోట్లు మాత్రమే కాగా, ఈ సారి మాత్రం తెలంగాణా దరిదాపుల్లోకి ఏపీ రాని రీతిలో బడ్జెట్ ను రూపొందించాలని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్లానింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

కేసీఆర్ చేసిన సూచనల ప్రకారం తెలంగాణ బడ్జెట్ 1.40 లక్షల కోట్లతో రూపొందుతోందని తెలుస్తోంది. ప్రణాళిక వ్యయం 62 వేల కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం 78 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మధ్య ఉండనుంది. ఇక ఏపీ బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 1.30 లక్షల కోట్లతో 2016-17వ సంవత్సర పద్దుకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. దీంతో ఈ దఫా తెలంగాణ బడ్జెట్, ఏపీ కంటే దాదాపు 10 వేల కోట్లు పైనే అధికంగా ఉండనుందన్నమాట. తన గురువు చంద్రబాబును ఎదుర్కొవడానికి, శిష్యుడు గీస్తున్న స్కెచ్ లు బాగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories