కేసీఆర్ కు షాకిచ్చిన వరంగల్ ఓటర్లు!

kcr warangal by poll resultsవరంగల్ ఉప ఎన్నికల తుది ఫలితాలు వచ్చేసాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ పై ఘనవిజయం సాధించారు. గతంలో కడియం శ్రీహరి సాధించిన విజయం కంటే దాదాపు 65 వేల పై చిలుకు ఆధిక్యాన్ని ఓరుగల్లు వాసులు అధికార పార్టీకి కట్టపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఊహించినదే అయినా, ఈ స్థాయి విజయం మాత్రం బహుశా కేసీఆరే కూడా అంచనా వేసి ఉండరు. ఈ కారణం చేతనే వైకాపా అధినేత జగన్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగారని పొలిటికల్ వర్గాలు పేర్కొన్నాయి.

అంచనా వేయని విజయాన్ని అందించి కేసీఆర్ కు షాకిచ్చిన వరంగల్ వాసుల తీర్పుకు “కేసీఆర్ అండ్ కో” పరమానందంలో మునిగి తేలుతున్నారు. కేసీఆర్ సంతానం కేటీఆర్ మరియు కవితలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇంతటి ఘనవిజయం అందించిన వరంగల్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని పసునూరి దయాకర్ వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories