కేసీఆర్ కోరిన ‘కోరిక’కు బాలకృష్ణ ‘సై’

KCR wish to watch Gauthamiputra satakarniki movie with megastar chiranjeeviసినీ వేడుకలపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం బహు అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదైన సంఘటన నందమూరి బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా జరిగింది. సినీ పరిజ్ఞానానికి దూరంగా ఉండే కేసీఆర్, తన వాక్స్చాతుర్యంతో అందరినీ సమ్మోహితులను చేసారు. అంతేకాదు, వేడుకనంతా నవ్వులతో ముంచెత్తారు కూడా..! ‘అన్న’ గారు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానం నుండి విక్టరీ వెంకటేష్ వరకు ఏ ‘స్టార్’ అనే విషయం తెలియదన్న చలోక్తుల వరకు కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.

ADVERTISEMENT

“ఎన్టీఆర్ కు వీరాభిమానిని, మదరాసీలుగా పిలవబడుతున్న వారిని తెలుగువారిగా మార్చిన ఘనత ఒక్క ఎన్టీఆర్ దేనని” కీర్తించారు. మా నాయకుడు ఎన్టీరామారావు గారు తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్ ఏదైతే ఉందో, అది చిరస్థాయిగా ‘ఎన్టీఆర్ గార్డెన్స్’గానే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, ఆయన ఎన్టీఆర్ గారు ఒక తరం నటుడు కాదు, జాతి గర్వించదగ్గ బిడ్డ. తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారు తెలియని వారు లేరు, అంత మహా నాయకుడు, అంతటి గొప్ప వ్యక్తి స్మారక చిహ్నం ఏదైనా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. వారి కొడుకుగా బాలకృష్ణ గారి 100వ చిత్రం అన్ని విధాలుగా విజయవంతం కావాలని, వచ్చిన పెద్దలు కూడా ఆశీస్సులు అందించాలి” అన్నారు.

ఈ సందర్భంగా శతచిత్ర కథానాయకుడు బాలకృష్ణను తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కోరిక కోరారు. “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్రం తనకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని, “చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి, నేను ఫ్యామిలీతో వచ్చి చూస్తాను. చిరంజీవి, మేమంతా కలిసే చూడాలని…” అనగానే చిరంజీవి కల్పించుకుని “ఫస్ట్ ఆడియన్స్ మీరే” అన్నారు. ఈ మొత్తం ఉదంతం వందలాది మంది అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల నవ్వుల కరతాళధ్వనుల మధ్య కేసీఆర్ విజ్ఞాపనకు బాలకృష్ణ ‘ఓకే’ చెప్పేశారు.

తన ప్రసంగం చివర, ప్రతి ఒక్కరూ బాలకృష్ణను అభినందించాలని చెబుతూ… “చిరంజీవి మెగాస్టార్ గారు… వెంకటేష్ మరి ఏం స్టారో నాకు తెల్వదు” అనగానే వేదిక కిందవున్న అభిమానులు నవ్వుతూ కేరింతలు కొట్టారు. పక్కనే ఉన్న బాలకృష్ణ, కేసీఆర్ కు సమాధానం ఇవ్వగా, “విక్టరీయా… ఆ విక్టరీ వెంకటేష్ గారు, శంకర్ గారు వచ్చారు. దాసరి గారు సరేసరి ఉన్నరు. రాఘవేంధ్రరావు… మహామహులు ఉన్నరు. ఇంతమంది దీవెనలతో… సింగీతం శ్రీనివాసరావు గారు పెద్దలు… ఎన్టీఆర్ గారితోనే అనేక చిత్రాలు నిర్మించినటువంటి దర్శకులు… నన్ను కూడా ఆశీర్వదించారు. ఈ ముహూర్తం.. గొప్పగా సినిమా అనుకున్నంత వేగంగా నిర్మితమై తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయే చారిత్రక సినిమాగా నిలుస్తుందని మరొక్కసారి తెలియజేస్తున్నాను… సంతోషం, థ్యాంక్యూ” అంటూ తన ప్రసంగాన్ని ముగించి, బాలకృష్ణను కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆడిటోరియం అంతా ఈలలు, కేకలు చప్పట్లతో దద్దరిల్లింది.

ADVERTISEMENT
Latest Stories