మెగాస్టార్ మెగా మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయిన అందాల బొమ్మ అనుష్క, చిత్ర బృందానికి షాక్ ఇస్తూ డేట్స్ అడ్జెస్ట్ చేసుకోలేక తప్పుకుందని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా చిరంజీవికే నో చెప్పడంతో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వార్తకు శుభం కార్డు పడిందో లేదో తెలియక ముందే మరో మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ కు కూడా ఇలాంటి అనుభూతే తగిలిందంటూ ఫ్రెష్ గా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఎస్.జే. సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ‘నేను శైలజ’ ఫేం కీర్తి సురేష్ ను ఎంపిక చేసారన్న వార్తలు హల్చల్ చేసాయి. కానీ, తమిళంలో విజయ్ తో ఇప్పటికే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి, డేట్స్ అందుబాటులో లేక పవర్ స్టార్ సినిమాకు రెడ్ సిగ్నల్ వేసిందని సినీ వర్గాల టాక్. ఇటీవల కాలంలో హీరోయిన్లకు తేదీలను అడ్జెస్ట్ చేయడం తలకు మించిన భారంగా మారుతోంది.
అగ్ర హీరోలతో ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియక ఎదురు చూపులు చూడటం ఒక వంతైతే, అనుకోకుండా వచ్చిన సందర్భాలలో డేట్స్ ను కేటాయించలేక ఇబ్బందులు పడుతున్న వైనం మరొకటి. దీంతో చిరంజీవి సినిమా ఆఫర్ అయినా… పవన్ కళ్యాణ్ ఆఫర్ అయినా ఒక్కటే కదా..!



