సోషల్ మీడియాలో హోరెత్తుతున్న “మెగా ఫేక్ కలెక్షన్స్”

Khaidi No 150 Mega Fake Box Office Collectionsరెండు పెద్ద సినిమాలు తలపడుతున్నాయంటే ఇద్దరు హీరోల అభిమానులు ప్రతి చిన్న విషయాలలోనూ చాలా అలర్ట్ గా ఉంటారు. అలాంటిది కలెక్షన్స్ విషయంలో అయితే మరింత పకడ్భందీగా ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘ఖైదీ నంబర్ 150’ తొలి రోజు ఆల్ టైం రికార్డు సృష్టించిందని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటన చేయడంతో, అందరి చూపులు ‘మెగా కలెక్షన్స్’ వైపుకు మళ్ళాయి. అయితే చిరు రీ ఎంట్రీ సినిమాకున్న క్రేజ్ రీత్యా ఫస్ట్ డే నాడు ఈ మాత్రం రావడం ఎంత సత్యమో, రెండవ రోజు నుండి “ఖైదీ నంబర్ 150” కలెక్షన్స్ దారుణంగా పడిపోయాన్నది కూడా అంతే వాస్తవం.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘ఖైదీ నంబర్ 150’ కలెక్షన్స్ గురించి రేగుతున్న ప్రచారం రీత్యా, ఓ కన్నేసిన నందమూరి అభిమానులు ‘ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్’గా కొట్టిపడేసారు. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి చెప్పారు గానీ, రెండవ రోజు కలెక్షన్స్ పై పెదవి విప్పలేదు. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ పీఆర్ఓ, ఇండస్ట్రీ హిట్ అధినేత అయిన బిఎ రాజు తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘ఖైదీ నంబర్ 150’ మరియు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కలెక్షన్స్ ను వివరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు కేరాఫ్ అడ్రస్ అయిన వైజాగ్ లో తోలి రోజు 156 ఉన్న స్క్రీన్లు రెండవ రోజు చేరుకునే సమయానికి 97కు చేరుకున్నాయి.

ADVERTISEMENT

స్క్రీన్లు తగ్గడంతో యధావిధిగా ఈ ప్రభావం కలెక్షన్స్ పైన పడి తొలి రోజుతో పోలిస్తే… 3వ వంతుకు పడిపోయాయి. అలాగే మూడవ రోజు కూడా అదే స్క్రీన్లతో కలెక్షన్స్ వివరాలను పోస్ట్ చేసిన బిఎ రాజు, కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. రెండు పెద్ద సినిమాల కలెక్షన్స్ ను పోస్ట్ చేయగా, కేవలం “ఖైదీ నంబర్ 150”కి సంబంధించిన కలెక్షన్స్ ను మాత్రమే ఎందుకు తొలగించారు? దీని వెనుక ఉన్న మర్మమేమిటి? అంటూ నందమూరి అభిమానులు అసలు విషయాలను పరిశోధించే పనిలో పడ్డారు.

మెగా అభిమానుల లెక్క ప్రకారం ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులలో కోటికి పైగా షేర్ రాగా, బిఎ రాజు ప్రకారం ఆ సంఖ్య 78 మరియు 85 లక్షలకే పరిమితమైంది. దీంతో “ఫేక్ మెగా కలెక్షన్స్” అంటూ మెగా సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ను ఉదహరిస్తూ… సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పండగ నాడు బిఎ రాజు గారు చేసిన ఒక్క ట్వీట్ నందమూరి అభిమానుల పాలిట ఆయుధంగా మారడంతో, మెగా కలెక్షన్స్ ను ఏకరువు పెడుతున్నారు. మరి అసలు వాస్తవం ఏమిటన్నది నిర్మాత అయిన రామ్ చరణ్ ఒక ప్రకటన చేస్తే గానీ వాస్తవం వెలుగు చూసే అవకాశం లేదు.

Khaidi No 150 Mega Fake Box Office Collections

Khaidi No 150 Mega Fake Box Office Collections

ADVERTISEMENT
Latest Stories