మెగాస్టార్ మెగా మూవీ ఎలా ఉందన్న విషయం ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ మూవీ చూసిన ఆనందంలో ఉన్న అభిమానులు, సినిమాలోని హైలైట్స్ గా భావించే మెగాస్టార్ స్టెప్పులను రికార్డు చేసి యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేయడం విశేషం. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’గా భావించే చిరంజీవి – రామ్ చరణ్ ల కలయికలోని స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి.
నిజానికి ఇలాంటి సన్నివేశాల కోసమే అభిమానులు ఒకటికి రెండు మూడు సార్లు ధియేటర్ల వైపుకు పరుగులు పెడుతుంటారు. కానీ, తొలిరోజునే చెర్రీ – చిరుల వీడియో యూ ట్యూబ్ లోకి వచ్చేస్తే… ఆ ప్రభావం కలెక్షన్ల పడదా? దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేం గానీ, మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీకి సంబంధించిన పలు స్క్రీన్ షాట్స్, పాటల వీడియోలు సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT



