‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో పట్టుబడ్డ నటుడు!

Kireeti Damaraju caught in drunt and drive caseగత రాత్రి హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్ నిర్వహించగా, సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా, ఆయన బ్లడ్ ఆల్కహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు బుక్ చేశారు.

“ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా” తదితర చిత్రాల్లో నటించిన కిరీటీ దామరాజు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ తనిఖీల్లో మొత్తం 20 వాహనదారులపై కేసులు బుక్ చేశామని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే తానూ మద్యం సేవించడంపై సదరు నటుడు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగాడు.

ADVERTISEMENT

‘ఏపీ 09 సీపీ 6893’ నంబర్ గల కారులో వచ్చిన అతను మద్యం తాగి ఉన్నాడని గమనించిన పోలీసులు, తొలుత కారు నుంచి దిగాలని సూచించడంతో కారు దిగాడు. ఆపై కూర్చుని మాట్లాడుకుందామని ఓ అధికారి చెప్పడంతో డివైడరు పైనే కూర్చున్నాడు. తాను ఒకే ఒక్క పెగ్గు తాగానని కిరీటి చెప్పడంతో, “సమస్య ఏంటంటే… మీరు ఒకటా, రెండా అనేది కాదు. ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. వాహనం అప్పగించి మాకు సహకరించాల్సిందే” అని పోలీసధికారి స్పష్టం చేశారు. దామరాజుకు సోమవారం నాడు కౌన్సెలింగ్ నిర్వహించి, మంగళవారం నాడు కోర్టుకు తీసుకెళ్లనున్నామని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories