డేటింగ్ చేస్తే దాచిపెట్టను!

KL Rahul responds on dating with Nidhi Agerwalఇటీవల ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో కేఎల్ రాహుల్ కనిపించిన తరువాత వీరిద్దరి మధ్య డేటింగ్ మొదలైందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు, వీరిద్దరూ కలిసున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా రాహుల్ కూడా స్పందించాడు. తన జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఓ ప్రిన్సెస్ లా చూస్తానని, ఎవరితోనైనా డేటింగ్ ప్రారంభిస్తే దాచి పెట్టబోనని చెప్పాడు.

“ఓ అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉండలేరా? అదేమంత కష్టమా? నిధి నాకు చాలా కాలంగా తెలుసు. ఇద్దరమూ ఒకే నగరం నుంచి వచ్చాం. తాను ఎంచుకున్న రంగంలో ఆమె చక్కగా సాగుతోంది. నేను క్రికెటర్, ఆమె నటి కాకముందు నుంచే ఇద్దరికీ పరిచయం ఉంది. మేమిద్దరమే కలసి బయటకు వెళ్లలేదు. ఆ రోజు మాతో పాటు ముగ్గురు, నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు.

ADVERTISEMENT

స్నేహితులతో కలసి తిరగడం ఎవరికైనా బాగుంటుంది కదా… అక్కడేమీ జరగలేదని నేను చెబుతున్నాను. నా జీవితంలోకి ఎవరైనా వస్తే, అది ప్రతి ఒక్కరికీ తెలియజేస్తాను. ఏదీ దాచను” అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా, తామిద్దరమూ మంచి స్నేహితులమని, తమ మధ్య ప్రేమ, డేటింగ్ లేవని ఇప్పటికే నిధి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories