టీజర్ టాక్ – సంపూ… నువ్వు చింపేసావుగా..!

kobbari-matta-trailer-talk‘హృదయ కాలేయం’ టీం నుండి ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్న మరో మూవీ ‘కొబ్బరిమట్ట.’ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. 150 సెకన్ల నిడివితో ఫస్ట్ టైం టీజర్ ను లాంచ్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో సంపూ చేసిన సందడికి పూర్తి న్యాయం జరిగింది.

‘పెదరాయుడు’ గెటప్ లో సంపూ మహిళల గురించి అనర్గళంగా చెప్పిన డైలాగ్ కు సంపూ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పుట్టిన దగ్గర నుండి పెళ్లై, పిల్లలు కని, భర్తకు సేవలందించే వరకు… మధ్య మధ్యలో సీరియల్ పేర్లు చెప్తూ సంపూ పలికిన డైలాగ్స్ కెవ్వు కేక పెట్టిస్తున్నాయి. అయితే ఇది అందరికీ నచ్చే టీజర్ మాత్రం కాదు. కేవలం సంపూ ‘స్పెషల్’ టీజర్ ఇది.

ADVERTISEMENT

పేరడీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంపూ, పెదరాయుడు గెటప్ లో ఫస్ట్ లుక్ లో ధియేటర్లో అరుపులు పెట్టించడం ఖాయంగా కనపడుతోంది. ఈ ఒక్క గెటప్ మాత్రమే కాదు, ఈ సినిమాలో చాలా గెటప్ లు వేసినట్లు కనపడుతోంది. ధియేటర్లలో సంపూ సృష్టించే ప్రభంజనం ఎలా ఉన్నా… ఈ టీజర్ తో సోషల్ మీడియాలో హంగామా అయితే సృష్టించాడు.

ADVERTISEMENT
Latest Stories