రాజకీయ పతనావస్థకు నిలువెత్తు నిదర్శనం.. తిడుతూనే ఉంటా అని చెప్పుకోవడం

Kodali Naniకొడాలి నాని.. తన పనితనం కారణంగా కాకుండా నోటిదురుసుతో నిత్యం వార్తలలో ఉండే వ్యక్తి. ఆయన మీడియా ముందుకు వచ్చారంటే స్త్రీలు, పిల్లలు ఛానల్ మార్చాల్సిన పరిస్థితి. తాజాగా ఆయన మీద తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో దేవినేని ఉమ, టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు.

కొడాలి నాని సహా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, వంశీపై ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఈ విషయం పక్కన పెడితే… నాని నిత్యం తన నోటిదురుసు మాటలతో రాజకీయ నాయకుల నుండి ప్రజలు ఎక్సపెక్ట్ చెయ్యని భాషలోనే మాట్లాడతారు.

ADVERTISEMENT

సరే ఎప్పుడో ఒకసారి అనుకుంటే కాదు… ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఇదే పద్దతి… పైగా ఇతర నాయకుల పుట్టుకలు, తల్లిదండ్రుల గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ కూడా వీటిని ప్రోత్సహించడం. ఆ పార్టీ సమర్ధకులు కూడా నాని వ్యాఖ్యలను మాస్ అంటూ హీరోయిజం అంటూ ఎలేవేషన్లు ఇవ్వడం రాజకీయ పతనావస్థకు మరో తార్కాణం.

దీనితో నాని వంటి వారు మరింత రెచ్చిపోతారు. “పార్టీలో పనిలేని వారే నాపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారు. నాపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటాను,” అంటూ నాని గొప్పగా మరో సారి మీడియా ముందు చెప్పుకోవడం శోచనీయం.

ADVERTISEMENT
Latest Stories