బూతుల మంత్రి కొడాలి నాని ఇప్పుడు పోరంబోకు మంత్రి అయ్యాడు… ఉమ

Kodali Nani fires on Chandrababu Naidu and devineni umaకృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మంగళవారం హై డ్రామా నడించింది. ఏ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చింది అనే దాని మీద సవాలు చేశారు నాని… దాని కోసం ఉమ గొల్లపూడి సెంటర్ వచ్చి… అక్కడే దీక్షకు దిగారు.

ఈ దీక్షకు అనుమతి లేదంటూ దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం దాకా విడుదల చెయ్యలేదు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిపై దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బూతుల మంత్రి కొడాలి నాని ఇప్పుడు పోరంబోకు మంత్రి అయ్యాడని విమర్శించారు.

ADVERTISEMENT

కొడాలి నానికి చదువు లేదని.. సంస్కారం లేదని ఎద్దేవా చేశారు. కొడాలి నానిని పశువులతో కూడా పోల్చలేమన్నారు. జగన్‌ ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. డిబేట్‌కి స్పెల్లింగ్ తెలియని వారితో నేను చర్చించేది ఏంటని వ్యాఖ్యానించారు. ఆ స్థాయి కొడాలి నానికి ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఏది ఏమైనా చర్చ జరగకపోగా… రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటూ టీవీ ఛానెళ్లకు రేటింగులు ఇచ్చారు అంతే. ఇప్పుడు మంత్రి నాని మరోసారి మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు దగ్గర నుండి ఉమ వరకు బూతులు తిట్టిపోతారు. వీటి వల్ల ఎవరికి ఉపయోగం?

ADVERTISEMENT
Latest Stories