రాజగోపాల్ మరో కేసీఆర్ అవుతారా.?

Komatireddy Raj Gopal Reddy Warning

కాంగ్రెస్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా తన పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి హెచ్చరికలు పంపారు.

మరో 55 రోజులే గడువు, ఆ గడువు లోపు తనకు మర్యాదగా మంత్రి పదవి ఇస్తారా.? లేదా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటా అంటూ మునుగోడు ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయంశంగా మారాయి.

ADVERTISEMENT

కాంగ్రెస్ పార్టీని నేనే మంత్రి నేనే రాజు, మరో పదేళ్లు నేనే సీఎం అంటూ ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇవ్వండి లేకుంటే ముఖ్యమంత్రిని అవుతా అంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీ అధిష్టానం గమనిస్తూనే ఉంది.

అయితే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్న వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ హస్తం కూడా ఉందనేది రాజగోపాల్ వాదన. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంమత్రి పదవిలో ఉననప్పుడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే మాదిరి తనకు ఒక మంత్రి పదవి కావాలని,

బాబు క్యాబినెట్ లో తనకు ఒక స్థానం కల్పించాలంటూ టీడీపీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చినప్పటికీ అందుకు అప్పుడున్న పరిస్థితులు సానుకూలంగా లేవనే కారణంతో బాబు కేసీఆర్ ని తన క్యాబినెట్ లోకి తీసుకోలేకపోయారని, ఆ విభేదాలే కేసీఆర్ ని టీడీపీ వీడేలా చేశాయని,

ఆ ఆవేశమే తెరాస కి పునాదులు వేసిందని, దాని ఫలితమే రెండు రాష్ట్రాల మధ్య విభజన గోడలు అంచెలంచెలుగా బలపడ్డాయని, ఒక మంత్రి పదవి ఖరీదు 2014 నాటి గాయాలు అని తెలుగు రాష్ట్ర రాజకీయాలలో బలంగా ప్రచారం జరిగింది. అలాగే దాని పర్యవసానాలే టీడీపీ కి కేసీఆర్ అనే ఒక బలమైన రాజకీయ శత్రువుని తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు రాజగోపాల్ తన మంత్రి పదవి పై చేస్తున్న కామెంట్స్ నాటి ప్రచారాలను గుర్తుచేస్తున్నాయి. రాజగోపాల్ కూడా కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని, నాటి రాజకీయ అపరిణామాలను లెక్కలు వేసుకుని మంత్రి పదవి కాకుంటే ముఖ్యమంత్రే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారా.?

అయితే రాజగోపాల్ హెచ్చరికలను రేవంత్ రాష్ట్ర సరిహద్దులు దాటనిస్తారా.? లేదా చరిత్రలో లిఖించబడిన నాటి జ్ఞాపకాలను గుర్తించి సమస్యను సామరస్యపూర్వకంగా సద్దుమణిగిస్తారా.?

ADVERTISEMENT
Latest Stories