కొణిదెల నిహారికా…టాలీవుడ్ లో మెగా ఫామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్. అయితే పాపం ఎంట్రీ అయితే భారీగానే ప్లాన్ చేసుకుని ఇచ్చింది కానీ, ఇప్పటివరకూ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ భామ.
[m9ad]
తెలుగులో పెద్దగా వర్కౌట్ కావడంలేదు అని తమిళంలో ట్రై చేసింది…ప్లేస్ అయితే మారింది కానీ, రిజల్ట్ మాత్రం సేమ్…టూ…సేమ్. తెలుగులో ఒక మనసు..హ్యాపీ వెడ్డింగ్ సినిమాలు డిజాస్టర్స్ అవగా..ఇక తమిళం లో ‘ఒరు నల్ల నాల్ పాతు సోలారెన్’ సైతం తమిళంలో ఢమాల్ అంది.
అయితే వరుసగా సినిమాలు పోతున్నా నిహారికా మరో మారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తనతో వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన ప్రణీత్ దర్శకత్వంలో ‘సూర్య కాంతం’గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక రాహుల్ విజయ్ హీరోగా నటించనున్నాడు..నిర్వాణా సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుంది.
మరి ఈ సినిమా అయినా ఈ మెగా హీరోయిన్ కి హిట్ ను ఇస్తుందేమో చూద్దాం.



