కొరటాల… ఇది అన్యాయమే..!

Koratala siva to stop directing moviesదర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లు… ఆ ముగ్గురి హీరోల కెరీర్లలో అతి పెద్ద విజయాలు..! కట్ చేస్తే… దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ ఎంతో కాలం ఉండదన్న స్పష్టమైన సమాచారం! అవును… కొద్ది సినిమాలకు మాత్రమే కొరటాల దర్శకత్వం వహించబోతున్నారనేది ఇప్పుడు అఫీషియల్ న్యూస్. ఆ సంఖ్య ఎన్ని అన్నది ఇప్పుడే చెప్పలేం గానీ, కనీసం రెండెంకలకు చేరుకుంటారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

కేటీఆర్ తో జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ ఓ విషయాన్ని స్పష్టం చెప్పాడు. “కొరటాలకు అమితమైన రాజకీయ పరిజ్ఞానం ఉంది, త్వరలోనే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు” అంటూ కొరటాల అంతరంగాన్ని మహేష్ ఆవిష్కరించారు. ఇక్కడ్నుండి విజయోత్సవ సభకు వెళితే… నిర్మాత దానయ్య ప్రసంగిస్తూ… ‘ఆయన కొద్ది సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నారు, అది వద్దండి, ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి మీరు కావాలండి’ అంటూ కొరటాల గురించి ప్రస్తావించారు.

ప్రజా జీవితంలోకి వెళ్లి సేవ చేయాలన్న దృక్పధం మంచిదే, బహుశా కొరటాలకు ఆ ఆలోచనలు ఉన్నాయి కాబట్టే, ప్రతి సినిమాలోనూ సామాజిక బాధ్యతలను చూపెడుతూ సినిమాలు తీస్తున్నారు. రాజకీయాల్లోకి వెళితే ప్రజలకు మంచి నాయకుడు దొరుకుతాడేమో గానీ, ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు కొరత ఏర్పడుతుందన్నది వాస్తవం. ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా, ఒక సామాజిక అంశంతో కమర్షియల్ హిట్లు కొట్టిన తెలుగు దర్శకులలో కొరటాల పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories