ప్రభాస్… ఓ కోహినూరు వజ్రం..!

Krishnam Raju Praises Rajamouli after Watching Baahubali 2 The Conclusionకొడుకు పుట్టినపుడు కాదు… వాడు ప్రయోజకుడు అయినపుడు తండ్రికి కలిగే ఆనందం గురించి ఎన్నో కధలు, ప్రత్యక్ష సంఘటనలు చూసి ఉంటాం. ప్రస్తుతం తండ్రి కాకపోయినా ఆ స్థానంలో ఉన్న ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు పరిస్థితి కూడా ఇదే. “బాహుబలి-2: ద కన్ క్లూజన్” బెనిఫిట్ షో చూసిన అనంతరం… ఉద్వేగభరితమైన సంతోషంతో కృష్ణంరాజు దంపతులు ఉప్పొంగిపోతూ, తనయుడు ప్రభాస్ ను ఆకాశానికేత్తేసారు. వీరి మాటలు వింటూ అభిమానులు కూడా ఈలలు, గోలలతో రెచ్చిపోయారు.

“బాహుబలి-2: ద కన్ క్లూజన్” సినిమా పట్ల అభిమానులు మిక్కిలి ఆనందంగా ఉన్నారని, ఈ సినిమాలో ప్రతి ఫ్రేం కనులకింపుగా ఉందని, తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాగా, భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా “బాహుబలి”ని పేర్కొనవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా పట్ల సంతృప్తికరంగా ఉన్నామని, రాజమౌళి అంతర్జాతీయ స్థాయి విలువలతో ఈ సినిమాను రూపొందించాడని, సినిమా సూపర్ హిట్ అన్న విషయం తమకు ముందే తెలుసని సంతోషంగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఇక, కృష్ణంరాజు సతీమణి అయితే ఏకంగా ప్రభాస్ ను కోహినూరు వజ్రంతో పోల్చారు. కోహినూరు వజ్రానికి, ప్రభాస్ కి వెల కట్టలేమని, ప్రభాస్ రాజే కాదు, రాజులకు రాజు మహరాజులా ఉన్నాడని, సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ సినిమాలో ప్రభాస్ నటించడం ఆనందంగా ఉందని, ప్రభాస్ తమ ఇంట్లో జన్మించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, అమరేంద్ర భాహుబలిగా ప్రభాస్ నటన అమోఘం, అద్భుతమని రెట్టించిన సంతోషంతో చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories