తెలంగాణాలో ఇక ‘పైరసీ’ ఆగడాలు చెల్లవు!

KTR movie piracy in telanganaతెలుగు సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న ‘పైరసీ’పై తెలంగాణా సర్కార్ ఒకడుగు ముందుకేసింది. ‘తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్’ పేరిట యాంటీ పైరసీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు రూ.361 కోట్ల నష్టం వచ్చిందని ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా ప్రకటించాడు.

సినిమాల పైరసీ రాకెట్ సూత్రధారి జబల్‌పూర్‌లో వున్నట్లు యూనిట్ ట్రాక్ చేసింది. అతనితో పాటు, గ్యాంగ్‌లోని 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సూత్రధారి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగి అని, కొత్త సినిమాలను స్టోర్ చేసేందుకు తన కంపెనీ సర్వర్లను వినియోగించుకునేవాడని విచారణలో తేలింది. ఆన్‌లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడం.., పైరసీకి దోహదపడే వెబ్ సైట్ల నిషేధానికి సిపార్సులు చేయడం… ఈ యూనిట్ బాధ్యత. పైగా పైరసీదారులను ప్రాసిక్యూట్ కూడా చేస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు, రాష్ర్ట ఐటీ ఇండస్ర్టీ, ఇంటర్ నెట్ సర్వీసు ప్రొవైడర్లు, తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందిన ప్రతినిధులు, లీగల్ ఎక్స్‌ఫర్ట్స్ కూడా ఇందులో సభ్యులుగా వుంటారు.

ADVERTISEMENT
Latest Stories