తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో పేదల బతుకులు బాగుపడతాయంటూ పదేళ్ళు ఉద్యమాలు నడిపించిన కేసీఆర్, ఏర్పడిన తర్వాత “యస్! మన తెలంగాణ ధనిక రాష్ట్రం,” అని సగర్వంగా చెప్పుకున్నారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ “యస్! బీఆర్ఎస్ పార్టీ ధనిక పార్టీ” అని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు.
అదే సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన అప్పులతో రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విపక్షాల వాదనలను ఖండిస్తూ, “యస్! మనకు అప్పులు తీర్చగల స్థోమత ఉంది కనుకనే బ్యాంకులు మనకు అప్పులు ఇస్తున్నాయి. లేకుంటే ఇస్తాయా?” అంటూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్న విషయాన్ని ఆయన చాలా చమత్కారంగా చెప్పారు.
కానీ అప్పును, నిప్పును ఎవరూ ఎంతో కాలం దాచిపెట్టలేరు. ముఖ్యంగా ప్రభుత్వం మారితే అసలే దాగదు. కనుక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకే సగం ఆదాయం పోతోందని కుండ బద్దలు కొట్టేశారు.
అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఇలాంటి పాత కుండలు బద్దలవుతూనే ఉన్నాయి. కనుక జనాలు వాటికి బాగా అలవాటు పడిపోయారు. కనుక అప్పులు చేసినవాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఎవరూ భయపడటం లేదు.
అయితే తాజాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ ఆధిపత్య పోరాటాలు వ్యక్తిగత స్థాయికి చేరడంతో ఎవరెవరు ఎంతెంత ఆస్తులు పోగేసుకున్నారో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటున్నారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని సిఎం రేవంత్ సంచలన ఆరోపణ చేస్తే, వెయ్యి కోట్లు ఇచ్చి మిగిలిన 99 వేల కోట్లు నువ్వే తీస్కో అని కేటీఆర్ సవాలు విసిరారు.
కానీ నిన్న సిరిసిల్ల సభలో కేటీఆర్‌కు హైటెక్ సిటీ వద్ద మూడు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉన్నాయనే కొత్త విషయం సిఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఇది నిజమా కాదా? చెప్పాలని నిలదీశారు.
నిజమేనని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. అయితే తాను 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే తనకు హైదరాబాద్‌లో మూడు స్టార్ హోటల్స్‌లో ఉన్న విషయం పేర్కొన్నానని, ఈయనేదో కొలంబస్, వాస్కోడీగామాలా కనిపెట్టిన్నట్లు చెపుతున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నా పెళ్ళాం బిడ్డలకి బువ్వ పెట్టాలి కదా? అందుకు నేను వ్యాపారాలు చేసుకుంటే తప్పా?నా హోటల్స్‌కి ఉచిత పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి థాంక్స్,” అని కేటీఆర్ అన్నారు.
కానీ తెలంగాణ ఏర్పడితే ఒక్క కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడిందని, వారి కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టారనే సిఎం రేవంత్ రెడ్డి వాదనలు నిజమేనని కేటీఆర్ కూడా మెల్లమెల్లగా అంగీకరించక తప్పడం లేదు.
నా Hotelకి Free Publicity ఇచ్చిన Revanth Reddyకి Thanks!
నువ్వేమైనా Columbusవా.. Vasco da Gamaవా? కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నావేంటి?
–@KTRBRS #RevanthReddy pic.twitter.com/6nwz7Iu8nr
— M9 NEWS (@M9News_) October 1, 2026





