ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ బాబు పంచెకట్టు, ఖద్దరు చొక్కా ధరించి ఫ్యాన్స్ ను మైమరపించిన సంగతి తెలిసింది. మహేష్ వేసుకున్న డ్రస్ అభిమానులతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూ నచ్చేసింది. తనను పొగడుతూ కేటీఆర్ ఓ ట్వీట్ పెట్టగా దానిపై మహేష్ స్పందించాడు.
“నేను ధరించిన షర్ట్ కు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్స్ కేటీఆర్. నన్ను చేనేత పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ దుస్తులు చాలా సౌకర్యవంతంగా, స్టయిలిష్ గా, చల్లగా ఉన్నాయి. నా పర్సనాలిటీకి సరిగ్గా నప్పాయి” అని వ్యాఖ్యానించగా, కేటీఆర్ సైతం స్పందించారు. “చేనేత ఉత్పత్తులకు ప్రమోషన్ నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం.
దీనికి మద్దతిస్తున్న మీకు, కొరటాల శివకు నా ధన్యవాదాలు. ఈ సౌకర్యవంతమైన, స్టయిలిష్, కూల్ దుస్తులను మీ తదుపరి చిత్రాల్లోనూ ధరిస్తారని భావిస్తున్నాను” అని సమాధానం ఇచ్చారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు థ్యాంక్ చెప్పుకుంటూ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Handlooms promotion has been a cause close to my heart. Many Thanks to you and @sivakoratala for extending support👍
Hope you’ll continue to showcase these stylish, cool and comfortable handloom clothes in your future movies too#WearHandloom https://t.co/p1vl8iXrCF
— KTR (@KTRTRS) April 26, 2018



