తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కూకట్ పల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబంపై ప్రేమ ఒలకబోశారు కేటీఆర్. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నందమూరి కుటుంబంపై ప్రేమ ఉంటే కుకట్ పల్లిలో హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఎపిలో మంత్రి పదవి ఇచ్చి ఉండేవారని ఆయన అన్నారు. నారా లోకేష్ ను ఎందుకు కుకట్ పల్లి నుంచి పోటీ చేయించలేదని ఆయన ప్రశ్నించారు.
[m9ad]
నందమూరి కుటుంబాన్ని బలి చేయడానికే సుహాసినిని చంద్రబాబు అభ్యర్ధిగా చేశారని కేటీఆర్ అన్నారు. బహుశా సుహాసిని కూకట్ పల్లి నుండి ఒడిపోతారని కేటీఆర్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అత్యంత అనుకూలమైన స్థానాన్ని పార్టీ ఆమెకు కేటాయించింది. ఆమె గెలుపు కోసం భారీగా శ్రేణులను నాయకులను మోహరించింది. చంద్రబాబు నాయుడు, బాలయ్య, ఇతర ఏపీ మంత్రులు ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు.
మరి ఏ రకంగా ఆమెను బలి చేస్తున్నారు అని కేటీఆర్ అంటున్నారో. అదే విధంగా లోకేష్ పోటీ చేస్తే హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేసినట్టు ఎలా అవుతుంది? అలా చేసి ఉంటే నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఇవ్వకుండా సొంత కొడుకుకి ఇచుకున్నారని ఇదే కేటీఆర్ అనే వారు కదా. సరే తెలంగాణ రాష్ట్ర సమితికి హరికృష్ణ ఆయన కుటుంబ సభ్యులుకు అన్యాయం జరుగుతుందని అనుకుంటే పార్టీ ఏకగ్రీవం చేసి తమ గొప్ప మనసును నిరూపించుకోవచ్చు. ఇవన్నీ చెయ్యకుండా ఏదో నందమూరి కుటుంబం మీద వట్టి మాటలతో కడుపు నింపేస్తే దాని వల్ల ఉపయోగం ఏంటి? హరికృష్ణ చనిపోయినప్పుడు ఆయన మీద కేసీఆర్ గవర్నమెంట్ కు ఎందుకంత ప్రేమ వచ్చేసిందో రాజకీయల మీద అవగాహన ఉన్న వారికి తెలియనిది కాదు. నందమూరి కుటుంబం మీద చూపించే జాలి తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి మీద చూపిస్తే బావుండేది. ఆవిడకు టిక్కెట్ నిరాకరించినప్పుడు ఏమైంది ఈ సూక్తి ముక్తావళి?



