‘సరైనోడు’ ఆడియో హక్కులు కూడా వారి ఖాతాలోకే!

alluarjun- sarainodu teaser talk“1 నేనొక్కడినే” సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ సంగీత సంస్థ లహరి, అప్పటినుండి వరుసగా పెద్ద సినిమాల ఆడియోల హక్కులను సొంతం చేసుకుని తన ప్రభావాన్ని చాటుకుంటోంది. గత రెండు, మూడు సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలలో 90 శాతం సినిమాల ఆడియో హక్కులు లహరికే దక్కాయి.

ఈ కోవలోనే బోయపాటి – అల్లు అర్జున్ కాంభినేషన్ లో సిద్ధమవుతున్న “సరైనోడు” సినిమా ఆడియో హక్కులను కూడా లహరి సంస్థే సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ లో తెలియజేసిన సదరు సంస్థ, ఆడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని త్వరలోనే అందజేస్తామని ప్రకటించింది. విడుదలైన ఒక్క టీజర్ తో సెన్సేషన్ సృష్టించిన “సరైనోడు” ఏప్రిల్ మాసంలో విడుదలకు ముస్తాబవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories