‘ఎన్టీఆర్ ట్రస్ట్’పై లక్ష్మీపార్వతి ఆరోపణలు!

lakshmi-parvathi-sensational-comments-on-ntr-trustమహానటుడు నందమూరి తారకరామారావు పేరు చెప్పుకుని ఎంతో మంది బతుకుతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. నందమూరి తారకరామారావు ట్రస్ట్ పేరుతో విదేశాలకు వెళ్లి విరాళాలు వసూలు చేస్తున్నారని, ఈ తంతు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోందని, అలా సేకరించిన మొత్తాన్ని ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ అవార్డు పేరిట ఓ మెమెంటో, శాలువా తప్ప, నగదు పురస్కారం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు అంటున్నారని, అలా సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారని ఆమె అడిగారు. బ్రతుకు తెరువు కోసం ఆయన పేరు అందరికీ కావాలని, ఆయన పేరు మీద ఏదైనా చేయాలంటే ప్రజలు సహకరించాలని కోరుతున్నారని, సొంతంగా చేయాలని ఎందుకు ఆలోచించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఏం చేస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories