లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్: ఈనాడుకి ఖేదం… సాక్షికి మోదం

Lakshmi's-NTR-Movie-Trailerవివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ కాసేపటి క్రితం రిలీజ్‌ అయింది. 1989 ఎన్నికలలో ఎన్టీఆర్‌ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అది టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది అనేదే ఈ సినిమా.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ చిత్రం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారనుంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు చెందిన ఒక నాయకుడు నిర్మాతగా ఉండటంతో ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సాక్షి మీడియా ఈ టీజర్ తో పండగ చేసుకుంది. సాక్షి వెబ్ సైట్, టీవీ దీని గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగునే ఫోకస్ చేసింది సాక్షి.

ADVERTISEMENT

మరోవైపు ఈనాడు వెబ్ సైట్ లో ఈ టీజర్ ను కనీసం ప్రచురించలేదు. ఈ టీజర్ కు కొంచెం ముందే విడుదలైన మజిలీ సినిమా టీజర్ మాత్రం ఈనాడు వెబ్ సైట్ లో ఉండటం గమనార్హం. ఈనాడు ఎన్టీఆర్ సమయంలో లక్ష్మి పార్వతి పై చంద్రబాబు కోసం ఉద్దేశపూర్వకంగా బురద జల్లిందని ఈ సినిమాలో వర్మ ఆరోపించారు. ఆ కారణంగానే ఈనాడు ఈ ట్రైలర్ ను బ్లాక్ అవుట్ చేసినట్టు ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ వివాదం ఎక్కడకి దారి తీస్తుంది అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories