చీప్ ఆరోపణలపై పోలీసులను ఆశ్రయించిన అమ్మడు

Lavanya Tripathi Files Case Against Sriramoju Sunisithహీరోయిన్‌ లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు మూడు సార్లు అబార్షన్ చేయించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా సదరు సునిశిత్‌ అనే వ్యక్తి పలు యూట్యూబ్‌ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా మంది సినిమా సెలెబ్రిటీల పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర నుండి కొందరు స్టార్లు పెద్ద సినిమాలు లాక్కుని తనను మోసం చేశారని, వారు స్టార్లు అయిపోయారని మొదట్లో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత తనకు తమన్నా, లావణ్యలతో అఫ్ఫైర్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

హీరోయిన లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు తమది సీక్రెట్ లవ్ మ్యారేజ్ అని..2015లోనే పెళ్లి అయిపోయిందని పేర్కొన్నాడు. తనకు, లావణ్యకు గొడవ జరిగిందని..అందుకే ఇద్దరు కలిసున్న ఫోటోలు డిలీట్ చేశానని పేర్కొన్నాడు. తనకు మూడు సార్లు కడుపు వస్తే తీయించా అని కూడా చెప్పుకొచ్చాడు.

ఈ వీడియోలు వైరల్ కావడంతో లావణ్య దీనిపై కంప్లయింట్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా.. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమా వకీల్ సాబ్ లో ఆమె సెకండ్ హీరోయిన్ అవకాశం కొట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయం అధికారికంగా దృవీకరించాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories